ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్‌కి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ వైజ్‌గా తెలుగు సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయంటే.. తెలుగు దర్శకనిర్మాతల ఫోకస్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలుగు సినిమాకు ఈ మధ్యకాలంలో ఇంతటి వైభవం రావడానికి కారణమైన హీరోలలో మాత్రం మొదట రెబల్ స్టార్ ప్రభాసే ఉంటాడు. హిట్, ఫట్ అనేది పక్కన పెడితే.. ప్రభాస్ అంటేనే స్టార్ స్టేటస్‌ని మించి చాలా పెద్ద.. అనే రేంజ్‌కి వెళ్లాడు. దర్శకనిర్మాతలు కూడా ప్రభాస్‌తో ఆ కటౌట్‌కి తగ్గ సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, సలార్.. రీసెంట్‌గా వచ్చిన కల్కి 2898 AD.. ప్రభాస్ స్టామినా ఏంటనేది చాటి చెబుతున్నాయి.
అలాంటి ప్రభాస్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేమంటే.. నెటిజన్లు కొందరు పాన్ ఇండియా వైజ్‌గా ఫ్యూచర్‌లో ప్రభాస్‌కి టఫ్ కాంపిటేటర్ ఎవరు అంటారు? అనే ప్రశ్నని సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని పేర్లు అయితే నెటిజన్లు చెబుతున్నారు కానీ.. ఏ ఒక్కటీ ప్రభాస్‌ని మ్యాచ్ చేయలేకపోతుండటం విశేషమనే చెప్పుకోవాలి.
ఇదిలా ఉంటే.. ప్రభాస్‌కి ఫ్యూచర్‌లో టఫ్ కాంపిటేటర్‌ని నేనే అంటూ టాలీవుడ్‌కి చెందిన ఓ హీరో స్వయంగా రియాక్ట్ అవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? హ్యాపీ డేస్ సినిమాతో మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్. పాన్ ఇండియా వైజ్‌గా ఫ్యూచర్‌లో ప్రభాస్‌కి టఫ్ కాంపిటేటర్ ఎవరు అంటారు? అనే ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ.. నేను ఉన్నా కదా అంటూ వరుణ్ సందేశ్ రిప్లయ్ ఇచ్చిన తీరుకి నెటిజన్లు కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు వస్తే.. ప్రభాస్ కూడా డిఫెండ్ చేయడం కష్టం అంటూ కామెడీగా రియాక్ట్ అవుతున్నారు.