కల్కి 2898 AD చిత్రాన్ని ఎలాంటి ఆర్భాటాలు అంటే ప్రమోషన్ లేకుండా కేవలం ముంబై ఈవెంట్ తోనే సరిపెట్టేసి ఆడియన్స్ ముందుకు వచ్చేసారు మేకర్స్. టైమ్ బాగుండి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే సెలబ్రిటీస్ సినిమాని ఎత్తేసారు కానీ.. లేదంటే కల్కి టాక్ అటు ఇటు అయినట్లయితే కల్కి మేకర్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకునేవారు .
కల్కి చిత్రానికి తగినంత సమయం ఉంచుకుని కూడా నాగ్ అశ్విన్ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు అనే విమర్శలు ఉన్నాయి. ప్రభాస్ కూడా బుజ్జి ఈవెంట్, ముంబై ఈవెంట్ లో తప్ప మీడియాకి కనబడలేదు. ఒక్క ఇంటర్వ్యూ లేదు, అయినా కల్కి ని ప్రేక్షకులు ఆదరించారు. భారీ హైప్ ఉండడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అలాగే రోజు రోజుకి కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి. మొదటి వీకెండ్ గడిచేసరికి 550 కోట్లు గ్రోస్ కలెక్ట్ చేసి కల్కి స్టామినా చూపించింది.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తెలుగు సినిమా గొప్పదనాన్ని పొగిడిన వారే కానీ పొగడని వారు లేరు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసుకి కల్కి ప్రాణం పోసింది. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల కిలకిలలు, బాక్సాఫీసు గలగలలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కల్కి మేకర్స్ యూనిట్ సభ్యులు, నటులతో అలాగే సినిమాని పొగిడేసిన మెగాస్టార్, సూపర్ స్టార్ లని తీసుకొచ్చి సక్సెస్ సెలెబ్రేషన్స్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరిక.
అదే తెలుగు రాష్ట్రాల్లో కల్కి సక్సెస్ మీట్ పెడితే అమితాబ్, దీపికా, కమల్ వస్తారా, అదే ముంబైలో నిర్వహిస్తే వాళ్ళు అందుబాటులో ఉంటారు కానీ.. తెలుగు అభిమానులకి కోపమొస్తుంది. మరి నాగ్ అశ్విన్ ఆ సక్సెస్ మీట్ ఏదో ప్లాన్ చేస్తే బావుంటుంది అనేది చాలామంది కోరిక. చూద్దాం మేకర్స్ ఏం చేస్తారో అనేది.