వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. శరత్ కుమార్ తన కుమర్తె వివాహాన్ని అంగరంగ వైభవముగా జరిపించేందుకు థాయిలాండ్ లో అన్ని ఏర్పాట్లు చేసేసారు. ముంబై కి చెందిన ఆర్ట్ గ్యాలరీ ఓనర్ నికోలాయ్ సచ్ దేవ్ ని వరలక్ష్మి ప్రేమ వివాహం చేసుకోబోతుంది. సచ్ దేవ్ కి ఇప్పటికే పెళ్ళై పాప కూడా ఉంది. భార్య తో విడాకులు అవ్వగా.. అతనికి 17 ఏళ్ళ టీనేజ్ కుమార్తె ఉంది.
ఇక సచ్ దేవ్ ని ప్రేమ వివాహం చేసుకుంటున్న వలక్ష్మి శరత్ కుమార్ కాబోయే భర్త తో కలిసి పరిచయమున్న ప్రముఖులందరిని పెళ్ళికి ఆహ్వానించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గర నుంచి సూపర్ స్టార్ రజిని వరకు, టాలీవుడ్ లో మెగాస్టార్ చిరు నుంచి నందమూరి హీరో బాలయ్య వరకు, అలాగే పీఎం మోడీని కూడా శరత్ కుమార్ ఫ్యామిలీ పెళ్ళికి ఆహ్వానించింది. జులై 2 అంటే రేపే వరలక్ష్మి-సచ్ దేవ్ లు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఈ పెళ్లి థాయిలాండ్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే శరత్ కుమార్ ఫ్యామిలీ-నికోలాయ్ సచ్ దేవ్ ఫామిలీ మొత్తం థాయిలాండ్ కి చేరుకున్నారు. అయితే వరలక్ష్మి ఆహ్వానించిన ప్రముఖులందరూ చెన్నై లో జరగబోయే రిసెప్షన్ కి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక థాయిలాండ్ లో వరలక్ష్మి పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలైపోయాయి.
అందులో భాగంగా వరలక్ష్మి మెహిందీ వేడుక గత రాత్రి జరిగింది. కూతుర్ని కాబోయే అల్లుడు ని చూసి పట్టరాని ఆనందంలో శరత్ కుమార్ మెహిందీ వేడుకలో డాన్స్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్ గా మారింది.