ఇప్పుడు అందరూ కల్కి 2898 AD కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ కల్కి కి అంతొచ్చింది, ఈ ఏరియాలో కల్కి కి ఇంతొచ్చింది.. ఫస్ట్ వీకెండ్ లోనే 550 కోట్లు కొల్లగొట్టిన కల్కి అంటూ సోషల్ మీడియా మొత్తం కల్కి ముచ్చట్లే. ఇక కల్కి హడావిడి ముగియగానే ప్రభాస్ ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ప్రస్తుతం అయితే ప్రభాస్ ఫారిన్ టూర్ లో సేదతీరుతున్నాడు. అక్కడి నుంచి రాగానే ప్రభాస్ నెక్స్ట్ ఏం చేస్తారు అనేది ఇప్పుడు అభిమానులని ఆలోచింపజేస్తున్న ప్రశ్న.
ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ 2 సెట్స్ మీదకి వెళతారా.. లేదంటే మారుతి తో రాజా సాబ్ చేస్తారా.. మే లోనే మొదలు కావాల్సిన సలార్2 షూటింగ్ ఇప్పటివరకు మొదలు కాలేదు. మరోపక్క ఆగష్టు నుంచి ప్రశాంత్ నీల్ NTR 31 మొదలు పెట్టబోతున్నారంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ప్రకటించింది. మరి ప్రశాంత్ నీల్ ముందు ప్రభాస్ తో సలార్ 2 సెట్స్ మీదకి వెళతారా, లేదంటే ఎన్టీఆర్ తో NTR 31 మొదలు పెడతారా..
ఇపుడు ప్రశాంత్ నీల్ ఏ డెసిషన్ తీసుకుంటాడని ఆతృతతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ అభిమానులు ఎదురు చూడడం కాదు.. ఏ సినిమాతో ప్రశాంత్ నీల్ సెట్స్ మీదకెళ్ళిన తర్వాత ఆ హీరో ఫ్యాన్స్ తో పొగిడించుకున్నా కానీ వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ ని ఆడుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.