2019 లో వృద్దులకు 3 వేలు పెన్షన్ అనే హామీని జగన్ ప్రభుత్వంలో ఏడాది కి 250 రూపాయలు పెంచుకుంటూ అంటే ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక 2 వేలు పెన్షన్ అందజేసిన జగన్ ప్రభుత్వం ఆతర్వాత ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ 2024 ఎన్నికల నాటికి ఆ వృద్ధాప్య పెన్షన్ ని మూడు వేలకి సమం చేసింది. అంతేకాని 2019 నుంచి జగన్ మాటిచ్చినట్టుగా 3 వేలు వృద్దులకు పెన్షన్ రూపంలో ఇవ్వలేదు.
కానీ 2024 ఎలక్షన్ లో తాను గెలిస్తే ఏప్రిల్, మే, జూన్ లకి కలిపి ఒక వెయ్యి చొప్పున, జులై లో నాలుగు వేలు పెన్షన్ చొప్పున మొత్తంగా 7 వేలు అందజేస్తాను అని మాటిచ్చినట్టుగా ఈరోజు జులై 1 న వృద్దులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ 7000లు అందజేశారు. అంతేకాదు తానే ప్రత్యేకంగా ప్రజల దగ్గరకు వెళ్లి అర్హులైన వారికి చంద్రబాబు పెన్షన్ అందజెయ్యడమే కాకుండా.. ప్రతి నియోజక వర్గంలోనూ ఆయా ప్రజా ప్రతినిధులు పెన్షన్ దారుల వద్దకు వెళ్లి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తన నియోజక వర్గమైన పిఠాపురం వెళ్లి అక్కడి వృద్దులకు పెన్షన్ ఇస్తున్నారు. మరి ఇదంతా సాధ్యం కాదు.. అమలు కాని హామీలిచ్చి ప్రజలని మోసం చేయలేము, ఇప్పుడు చంద్రబాబు వాటిని ఎలా అమలు చేస్తాడో చూస్తామంటూ ఛాలెంజ్ చేసిన వైసీపీ నేతలకి, జగన్ కి ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా వృద్దాప్య పెన్షన్స్ కార్యక్రమం చూసి మాటల్లేవ్.
తన వాలంటీర్ల చేత వైసీపీకి భజన చేయించుకున్న జగన్ ఇప్పుడు ఏం మాట్లాడాడో కూడా తెలియక సైలెంట్ గా బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా వృద్ధాప్య పెన్షన్స్ విలువెంతో అంచనా వేసే ఇలాంటి చర్యలు చేపట్టినట్లుగా చెప్పుకుంటున్నారు.