సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడెప్పుడు రాజమౌళి తో కలిసి సినిమా సెట్స్ కి వెళతారా అని మహేష్ అభిమానులతో పాటుగా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. మహేష్ బాబు ఇప్పటికే రాజమౌళి మూవీ కోసం స్పెషల్ మేకోవర్ అవుతున్నారు. రాజమౌళి-మహేష్ కాంబో మూవీ స్క్రిప్ట్ లాకవ్వగా రాజమౌళి కొన్ని లుక్ టెస్ట్స్ చేస్తున్నారని ఈ మధ్యన కీరవాణి గారు చెప్పారు.
అయితే ప్రస్తుతం మూవీ మొదలు అయ్యేందుకు మరో రెండు నెలలు సమయం పడుతుంది అనే టాక్ ఉండగా.. మహేష్ మాత్రం ఈ సమయాన్ని ఎక్కువగా ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. ఒన్స్ రాజమౌళి సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టాక మహేష్ కి ఎక్కువగా బ్రేకులు దొరక్కపోవచ్చు. అందుకే వీలైనంతగా ఫ్యామిలీతో కలిసి సమయాన్ని గడపడానికి వెకేషన్స్ కి వెళుతున్నారు మహేష్.
ఇపుడు కూడా భార్య నమ్రత, కొడుకు గౌతమ్, సితార లతో కలిసి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ తో మహేష్ లండన్ లో ఈ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఎప్పటిలాగే మహేష్ హెయిర్ కనిపించకుండా క్యాప్ తో కవర్ చేసేసారు. మరి రాజమౌళి తో మొదలు పెట్టబోయే మూవీ లో మహేష్ లుక్ ఎలా ఉంటుంది, అసలు ఆ కేరెక్టర్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో మహేష్ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు.