Advertisement
Google Ads BL

కల్కి: సెలెబ్రిటీస్ vs కామన్ ఆడియన్స్


సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సెలెబ్రిటీస్ అంతా కల్కి నామ జపం చేస్తూ దర్శకుడు నాగి ని, హీరో ప్రభాస్ ని, మెగాస్టార్ అమితాబచ్చన్ ని, లోకనాయకుడు కమల్ హాసన్ ని, హీరోయిన్ దీపికాని పొగుడుతూ విజువల్ వండర్ అంటూ ట్వీట్లు వేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ చిరంజీవి దగ్గర నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వరకు కల్కి ని పొగిడినవారే కానీ పొగడని వారు లేరు.

Advertisement
CJ Advs

తాజాగా కింగ్ నాగార్జున, అల్లు అర్జున్ కూడా కల్కి ని పొగుడుతూ వేసిన ట్వీట్లు చూస్తే సినిమాలంటే నచ్చని వారు కూడా థియేటర్స్ కి క్యూ కడతారు. అంతలా సోషల్ మీడియాలో కల్కి పై సెలెబ్రిటీస్ వేసే ట్వీట్లు వున్నాయి. మహాభారత ఎపిసోడ్ ని నాగ్ అశ్విన్ డీల్ చేసిన విధానానికి అబ్బురపడుతున్నారు. అయితే కల్కి 2898 AD చిత్రాన్ని వీక్షించిన కామన్ ఆడియన్స్ మాట మాత్రం సెలబ్రిటీస్ కి వ్యతిరేఖంగా ఉండడం షాకిస్తుంది.

కల్కి 2898 AD చిత్రాన్ని చూసి BC సెంటర్స్ ఆడియన్స్ కానివ్వండి, సాధారణ ప్రేక్షకుడు కానివ్వండి.. అదేం సినిమారా బాబు, అసలు కథ లేదు, పాట లేదు,  ప్రభాస్ హీరోగా చేశాడా.. విలన్ గా కనిపించాడా, ఇందులో అమితాబ్ హీరో లా కనిపించారు. ఆయన కేరెక్టర్ కి ఎలివేషన్ ఇచ్చి ప్రభాస్ ని మాత్రం జస్ట్ క్యామియో రోల్ కి పరిమితం చేసినట్టుగా అనిపించింది. ప్రభాస్ ఇంట్రో సీన్ అయితే చప్పగా ఉంది.  నాగ్ అశ్విన్ తీసుకున్న మహాభారత పాయింట్ సూపర్.. కానీ దానిని డీల్ చెయ్యడంలో నాగ్ అశ్విన్ అనుభవం సరిపోలేదు. 

కల్కి లో గెస్ట్ రోల్స్ ఎందుకు పెట్టారో అస్సలు అర్ధం కాదు. రాజమౌళి, దుల్కర్, విజయ్ దేవరకొండ, బ్రహ్మి ఇలా ఎవ్వరి కేరెక్టర్ కి ఇంట్రెస్టింగ్ సీన్స్ లేవు. చాలా చోట్ల బోర్ ఫీలింగ్, కొన్ని సీన్స్ లో నేపధ్య సంగీతం హై పిచ్ లో ఉండాల్సింది.. ఆ BGM వింటే నీరసమొచ్చేస్తుంది అంటూ కల్కి పై కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక్కడ సెలబ్రిటీస్ టాక్ నమ్మాలా, లేదంటే కామన్ ఆడియన్స్ కామెంట్స్ పట్టించుకోవాలా.. ఏది ఏమైనా కల్కి 2898 AD మాత్రం కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు నమోదు చేసే పనిలో బిజీగా ఉంది. 

Kalki 2898 AD: Celebrities vs Common Audience :

Celebrities vs Common Audience talk about Kalki 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs