కల్కి 2898 AD చిత్రం విడుదలై మూడు రోజులైంది. కల్కి ఓపెనింగ్స్ విషయంలో కొద్దిగా అటు ఇటు అయినా కల్కి కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వీక్ డే అయిన గురువారం కల్కి విడుదలైనా, క్రికెట్ మ్యాచ్ ల ఫీవర్ తో యూత్ కొట్టుకుంటున్నా, ఓ వైపు వర్షాలతో కొన్ని చోట్ల ఇబ్బందులు పడినా కల్కి కలెక్షన్స్ మాత్రమే అదిరిపోతున్నాయి. నార్త్ లో అయితే కల్కిని ఆరాధించని ప్రేక్షకుడు లేడు.
కల్కి పార్ట్ 1 లో అమితాబ్ ని హీరో ని చేసిన నాగ్ అశ్విన్ పార్ట్2 లో ప్రభాస్ ని హీరోని చెయ్యబోతున్నారు. పార్ట్ 1 లో ప్రభాస్ కాస్త నెగెటివ్ మైండ్ సెట్ లోనే కనిపిస్తాడు. అయితే కల్కి మొదటి భాగంలో విలన్ గా కమల్ చాలా తక్కువసేపు కనిపించారు. సెకండ్ పార్ట్ లో కమల్ కేరెక్టర్ క్రేజీగా ఉండబోతుందట. పార్ట్ 1 లో అమితాబ్ కి ప్రభాస్ కి మద్యన యాక్షన్ నడిపిస్తే.. పార్ట్ 2లో కమల్ కి ప్రభాస్ కి మధ్యన కత్తి లాంటి ఫైట్స్ పెట్టారట నాగ్ అశ్విన్.
కల్కి పార్ట్2 లో 80 శాతం యాక్షనే ఉంటుంది అని నాగ్ అశ్విన్ ఇప్పటికే రివీల్ చేసారు. ఆ 80 శాతం ఫైట్స్ లో ప్రభాస్ కి కమల్ హాసన్ కి మద్యన ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ నాగ్ అశ్విన్ డిజైన్ చెయ్యగా అవే కల్కి 2 లో హైలెట్ అవ్వబోతున్నాయట. ఇక నెక్స్ట్ సమ్మర్ కి కల్కి 2 ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్.