Advertisement
Google Ads BL

NBK109: లైన్‌లోకి మరో టైటిల్..


రీసెంట్‌గా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ ఎక్స్ వేదికగా.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న NBK109 చిత్రానికి టైటిల్ రివీలయ్యే సమయం ఆసన్నమైంది అంటూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వచ్చినప్పటి నుంచి.. ఎప్పుడెప్పుడు బాలయ్య, బాబీల సినిమా టైటిల్ వస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. అసలీ సినిమాకు ఏం టైటిల్ ఫిక్స్ చేసి ఉంటారో అని అంతా, మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులు అయితే సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇదే అదనుగా కొందరు ఈ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు టైటిల్‌ను సోషల్ మీడియానే డిసైడ్ చేస్తుందనే విషయం తెలియంది కాదు. ఓ నాలుగైదు టైటిల్స్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం కావడం, అందులో నుంచి ఓ టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేయడం వంటిది కొన్నాళ్లుగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు బాలయ్య, బాబీల కాంబో సినిమాకు కూడా కొన్ని పేర్లు సోషల్ మాధ్యమాలలో దర్శనమిస్తున్నాయి.

అయితే బాలయ్యకు ఉన్న సింహం సెంటిమెంట్‌తో టైటిల్ ఉంటుందా? లేదంటే ఈసారి మార్పు ఉంటుందా? అనేలా ఒకవైపు ఆలోచనలు నడుస్తుంటే.. మరో వైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్‌కు అదిరిపోయే టైటిల్స్‌ను సెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వీర మాస్, అసురుడు అనే టైటిల్స్ బాగా వినిపించాయి. ఇప్పుడు కొత్తగా డిమాన్ అనే టైటిల్ బాగా వైరల్ అవుతోంది. డిమాన్ అంటే దెయ్యం అని అర్థం. మరి ఇందులో ఏ టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇవి కాకుండా దర్శకుడు బాబీ తన మార్క్‌ని ప్రదర్శిస్తూ వేరే టైటిల్‌ని ఫిక్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం.. ఫైనల్‌గా ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో..

Is this title finalised for NBK109?:

NBK 109 To Get The Massiest Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs