మహానటి నాగ్ అశ్విన్-పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీ జూన్ 27 విడుదలైంది. భారీ అంచనాలు , విపరీతమైన హైప్ తో అయితే కల్కి థియేటర్స్ లో విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియాలో కల్కి 2898 AD పై సూపర్ పాజిటివ్ టాక్ వచ్చేసింది.
ఎప్పటి నుంచో థియేటర్స్ లో భారీ సినిమాలు లేక బోర్ కొడుతున్న ఆడియన్స్ కల్కి చిత్రాన్ని థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చెయ్యాలని చాలా వెయిట్ చేసారు. విపరీతమైన అంచనాలున్న కల్కి చిత్ర ఓటీటీ హక్కులపై భారీ పోటీ నెలకొంది. పెద్ద పెద్ద ఓటీటీలు కల్కి రైట్స్ కోసం కొట్టుకున్నాయి.
అయితే కల్కి చిత్ర హిందీ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. సౌత్ డిజిటల్ రైట్స్ ని మరో ఓటీటీ ఎగరేసుకుపోయినట్లుగా తెలుస్తోంది. అది కల్కి సౌత్ ఇండియా ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. సౌత్ భాషల్లో కల్కి అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ దగ్గరకు రాబోతుంది. హిందీ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది కాబట్టి ఆ ఓటీటీ నుంచి హిందీ లాంగ్వేజ్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వస్తుందన్నమాట.