ఓ ఐదు నెలలేమో శ్రీలీల పేరు టాలీవుడ్ లో వినిపించలేదు. గత రెండేళ్లుగా శ్రీలీల హవా టాలీవుడ్ బాగా నడిచింది. కానీ గత ఏడాది వరస వైఫల్యాలతో శ్రీలీల ఇబ్బంది పడడమే కాదు.. ఆమె పేరు కూడా కొన్నాళ్లుగా టాలీవుడ్ లో వినిపించలేదు. గుంటూరు కారం తర్వాత ఐదు నెలలు కామ్ గా ఉన్న శ్రీలీల మళ్ళీ పుంజుకుంది, యాక్టీవ్ అయ్యింది.
రవితేజ తో కలిసి మరో సినిమాలో నటిస్తుంది. అలాగే నితిన్ తో రొమాన్స్ చేస్తున్న రాబిన్ హుడ్ డిసెంబర్ లో విడుదల కాబోతుంది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్న శ్రీలీల సోషల్ మీడియాలో మాత్రం తరచూ కాకపోయినా అప్పుడప్పుడు గ్లామర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ యూత్ ని పడేస్తుంది.
తాజాగా సముద్రపు ఒడ్డున, ఓ ప్యాలెస్ లో శ్రీలీల వైట్ అవుట్ ఫిట్ లో అదరగొట్టేసింది. ఆ వైట్ మోడ్రెన్ ఫుల్ ఫ్రాక్ లో శ్రీలీల దేవతలా మెరిసిపోయింది. లూజ్ హెయిర్ తో తల మీద కిరీటంతో శ్రీలీల నిజంగా ఏంజిల్ మాదిరి కనిపించి కనువిందు చేసింది.