మళ్ళీ అధికారం మాదే.. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని బోలెడంత నమ్మకం పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా పనికిరాకుండా ఓడించారు. జగన్ మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణ పాఠం నేర్చుకోకుండా ఇప్పటికి పథకాలు తీసుకున్న ప్రజలు మనకెందుకు ఓట్లెయ్యలేదో అంటూ బాధపడుతూనే ఈసారి అంటే 2029 లో మనకే ఓట్లు పడతాయని ఆశపడుతున్నాడు కాదు అంటున్నాడు.
ఒకప్పుడు ఓదార్పు, పాద యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ ప్రజల నుంచి నిజంగా వైస్ బిడ్డగా ప్రేమని అందుకున్నాడు. అదే ప్రేమ 2019 లో సునామీలా ఓట్లు పడేందుకు దోహదపడింది. ఆ తర్వాత జగన్ లో విపరీతమైన మార్పు వచ్చేసింది. ప్రజల్లోకి వచ్చేది లేదు, కార్యకర్తలనేమి ఖర్మ ఎమ్యెల్యేలని కలిసేది లేదు, ప్రతి పక్షాల పట్ల కక్ష సాధింపు చర్యలు, మాట్లాడితే బటన్ నొక్కుడు తప్ప మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి మంచి చెడులు అడిగింది లేదు.
అక్కడే జగన్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోవడానికి ప్రధాన కారణమయ్యింది. మరోపక్క పోటీ చేసేటప్పుడు ప్రత్యేక హోదా రాగమెత్తిన జగన్ బీజేపీతో జత కట్టి ప్రత్యేక హోదా ని తుంగలో తొక్కడం, బీజేపీ పార్టీ తో కలిసి పార్టీ పరమైన అంశాల కన్నా ఎక్కువగా తన పర్సనల్ వ్యవహారాలంటే తనపై కేసులు బయటికి రాకూండా చూసుకోవడం తోనే జగన్ ఢిల్లీ ప్రయాణాలు ఉండేవి. అంతేకాని ఏ ఢిల్లీ ప్రయాణంలో ఏపీకి మంచి చేసే ఒక్క ప్రయోజనకర వార్త అందించలేదు.
ఇప్పుడు కూడా అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ లు దోస్తులుగా మారాక కూడా ఓడిపోయాక కూడా జగన్ బీజేపీ పార్టీకి సాగిల పడుతున్నాడు స్పీకర్ ఎన్నికలో బీజేపీ కి మద్దతునిచ్చాడు. అదే జగన్ ని జీరో చేసింది అంటున్నారు. మరోపక్క అంతేలే తనని జైలుకు పోకుండా కాపాడేది మోడీనే అందుకే బీజేపీ కి సై అన్నాడు, అటు సోనియా తో కలవలేడు కదా అప్పట్లో ఆమెతో పోరాడి పార్టీ పెట్టి గెలిచేసాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రాహుల్ కి మద్దతిస్తాడు.. ఇలా ఎటు చూసినా జగన్ జీరో గా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.