Advertisement
Google Ads BL

ఇవ్వాళ టికెట్ల గోల-రేపట్నుంచి కలెక్షన్స్ గోల


కల్కి.. కల్కి ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోటా విన్నా ఇదే మాట. మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోయే కల్కి 2898 AD మ్యానియా మాములుగా లేదు. కల్కి బుకింగ్స్ ఓపెన్ అయిన ప్రతి చోటా బుక్ మై షో దద్దరిల్లుతుంది. కల్కి వార్తలతో, కల్కి ని ట్రెండ్ చేస్తూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాని, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. మేకర్స్ అక్కడ కల్కి టికెట్స్ సోల్డ్ అవుట్, ఇక్కడ కల్కి టికెట్స్ అయ్యిపోయాయంటూ పోస్టర్స్ వదులుతున్నారు. 

Advertisement
CJ Advs

ఎవ్వరు చూసినా మీకు కల్కి టికెట్ దొరికిందా, మీరు ఎన్ని గంటల షో కి వెళుతున్నారు, నేను ఎర్లీ మార్నింగ్ షో చూసేస్తున్నాను, ప్రభాస్ సినిమా మొదటి రోజు మొదటి షో చూడకపోతే ఎలా అని మాట్లాడుకుంటుంటే.. యూత్ అయితే తెలంగాణ, ఏపీలో మిడ్ నైట్ షోస్ పడతాయా, లేదా.. ఒకవేళ పడితే టికెట్స్ ఎలా కొనెయ్యాలని ట్రై చేస్తూ హడావిడి చేస్తున్నారు. గత వారం రోజులుగా కల్కి 2898 AD టికెట్స్ గోల కనిపిస్తుంది. 

ఇక రేపటి నుంచి అంటే కల్కి విడుదలైన మరుక్షణం నుంచి కల్కి ఓపెనింగ్స్ ఇంతొచ్చింది, సెకండ్ డే షేర్ ఇంత.. ఫస్ట్ వీకెండ్ లో ఇన్ని వందల కోట్లు కొల్లగొట్టింది, ఓవర్సీస్ లో కల్కి ఆ సినిమా కలెక్షన్ క్రాస్ చేసింది, ఈ ఏరియా లో కల్కి కలెక్షన్స్ ఇంతొచ్చింది, నైజం లో కల్కి రారాజు అంటూ గంటకో న్యూస్ మొదలయ్యేలా ఉంది. 

పాజిటివ్ టాక్ వస్తే కల్కి ఫైనల్ ఫిగర్ ని అందుకోవడం ఇప్పుడప్పుడే ఎవరికీ సాధ్యం కాదు..  ప్లాప్ టాక్ వచ్చినా కూడా కల్కికి క్రౌడ్ పుల్లింగ్ ఖచ్చితంగా ఉంటుంది.. అసలు అడ్వాన్స్ బుకింగ్స్ టోన్ కల్కికి పెట్టిన బడ్జెట్ వచ్చేస్తుంది అంటూ కల్కి మేకర్స్ వదిలే పోస్టర్స్, అభిమానులు పెట్టె పోస్ట్ లతో కల్కి కలెక్షన్ న్యూస్ లే కనిపిస్తాయనడంలో సందేహం లేదు. 

Kalki 2898 AD mania at social media:

Kalki 2898 AD All Set For Sensational Records
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs