రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీస్ అలాగే హిందీ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పటికి.. సౌత్ స్టార్ హీరోలు రష్మిక ని పట్టించుకోవడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అంత క్రేజీ గా ఉన్న రష్మిక ని ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ పరిగణనలోకి తీసుకోకుండా జాన్వీ కపూర్ కి ఛాన్స్ ఇచ్చారు.
రశ్మికది పాన్ ఇండియా రేంజ్. ఇప్పటికే పుష్ప 1, యానిమల్ లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తో ఉన్న ఆమె ఇప్పుడు పుష్ప ద రూల్, ధనుష్ తో కుబేర లాంటి పాన్ ఇండియా ఫిలిమ్స్ తో పాటుగా ఈమధ్యన సూపర్ క్రేజీ హిందీ స్టార్ సల్మాన్ ఖాన్ సికిందర్ లోను ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ లోను రష్మిక బిజీగా కనిపిస్తున్నా తెలుగు స్టార్ హీరోలు రష్మిక వైపు ఎందుకు చూడడం లేదో ఆమె అభిమానులకి అర్ధం కావడం లేదు.
ఇప్పుడు కూడా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో అలియా భట్ ని సంప్రదిస్తున్నారని కొంతమంది, కాదు నేషనల్ క్రష్ రష్మిక ని అనుకుంటున్నారని కొందరు మాట్లాడుతున్నారు. నిజంగా రశ్మికకి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో ఆఫర్ వస్తే లక్కీ అనే చెప్పాలి. మరోపక్క ఆమెతో కలిసి నటించాలంటే లక్కుండాలి అనేవారు లేకపోలేదు. చూద్దాం NTR 31 లో రష్మిక కు స్థానం దక్కుతుందో, లేదో అనేది!