బాలీవుడ్ లో కరణ్ జోహార్ కనుసన్నల్లో టాప్ హీరోయిన్ గా ఎదుగుదామని కలలు కన్న యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి బాలీవుడ్ షాకిస్తూనే ఉంది. అక్కడ సక్సెస్ లు లేవు. అందుకే అమ్మడు ఫోకస్ సౌత్ పై పెట్టింది. సౌత్ లో నటిస్తాను అని సిగ్నల్స్ పంపిందో లేదో.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో ఛాన్స్ పట్టేసింది.
దేవర చిత్రం ఇంకా విడుదల కాకముందే మరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా RC 16 లోను అవకాశం దక్కించుకుని లక్కీ హీరోయిన్ అనిపించించుకుంది. ఆ చిత్రాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రకరకాల గ్లామర్ పిక్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.
గ్లామర్ కి ప్రాధాన్యతనిచ్చే జాన్వీ కపూర్ కి ఇంతవరకు సినిమాల్లో గ్లామర్ షో చేసే అవకాశమైతే రాలేదు. హిందీలో ఆమె చిత్రాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే. దేవర చిత్రంలోనూ తంగం పాత్రలో జాలరి పిల్లగా కనిపిస్తుంది. మరి దేవర సాంగ్స్ లో ఏమైనా అందాలు ఆరబోస్తుందేమో చూడాలి.
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్స్ చూస్తే దేవకన్య మాదిరి ఉంది అంటారు. అంతలాంటి గ్లామర్ బ్లాక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో జాన్వీ అందాలు ఆరబోసింది. విభిన్నమైన డ్రెస్ లో జాన్వీ కపూర్ కన్నుల విందు చేసింది. మీరు కూడా జాన్వీ కపూర్ గ్లామర్ షూట్ ని ఓ లుకేయ్యండి.