మనం మంచి చేసాం, ప్రజలకి చాలా చేసాం, మనం ఇచ్చిన పథకాలు ప్రజలకి చేరాయి, మన మంచి మనకే ఉంటుంది.. మన వల్ల లాభపడిన వారే మనకు ఓట్లేస్తారని నమ్మిన జగన్ మోహన్ రెడ్డి ని వాళ్ళే నట్టేట ముంచారు. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ఓడిపోయాక కూడా జగన్ మన మంచి ఇంకా ప్రజల్లో ఉంది.. వాళ్ళు ఈసారి మనకే ఓటేస్తారు.. అందరిలా తీర్చలేని హామీలు నేను ఇవ్వలేనంటూ మళ్ళీ మళ్ళీ అదే రాగం అందుకుంటున్నాడు.
గత రెండు రోజులుగా పులివెందులలో ప్రజల దగ్గర కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. దానితో వైసీపీ కార్యకర్తల్లో ఎక్కడలేని కోపం వస్తుంది. ఒకవేళ మనం చేసిన మంచి ప్రజలు గుర్తు పెట్టుకుంటే మనకే ఓట్లేసేవారు.. ఇలా ఓడిపోము కదా.. ఇప్పటికైనా జగన్ తన ధోరణి మార్చుకోవాలని ఆయన కార్యకర్తలే ఆయనకి సలహాలుగా చెబుతున్నారు.
మంచి చేసాం, మంచి చేసాం.. కానీ ప్రజలు ఓట్లెందుకు వెయ్యలేదో అని జగన్ మాట్లాడం వైసీపీ నేతలకి, కార్యకర్తలకే నచ్చడం లేదు. ప్రచారంలో ఏం చెప్పాడో.. ఇప్పుడు ఓడిపోయాక కూడా ప్రజలకి మంచి చేసాం, అదే మళ్ళీ మనల్ని అధికారంలోకి తెస్తుంది.. 2029 వరకు వెయిట్ చెయ్యండి, కళ్ళు మూసుకోండి అని జగన్ చెబుతున్న మాటలు సొంత పార్టీ వారికే నచ్చడం లేదు.
ఓటమికి అసలు కారణాలు వెతక్కుండా.. జగన్ ఇప్పటికి ప్రజలకి మంచి చేశామని చెప్పడం కరెక్ట్ కాదు.. జగన్ మారాలి.. అప్పుడే వైసీపీ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది లేదంటే ఇలా నిస్సత్తువుగా మారిపోతుంది. పార్టీలో ఫైనల్ గా జగన్ తప్ప మరెవ్వరూ మిగలరంటూ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకోవడం గమనార్హం.