దేవర చిత్రంలో ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ ని అలియా భట్ మిస్ చేసుకుంది. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా డిజ్ పాయింట్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో ఇమ్మిడియేట్ గా దేవర చిత్రానికి సైన్ చేసిన అలియా భట్ అప్పుడు ప్రెగ్నెన్సీ కారణం గా ఎన్టీఆర్ తో నటించలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ కోసం అలియా భట్ రావాల్సిందే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని ఫినిష్ చెసే పనిలో ఉన్నారు. మధ్య మధ్యలో ఎన్టీఆర్ ముంబై వెళుతున్నారు. అక్కడ వార్ 2 షూటింగ్ లో హృతిక్ రోషన్ తో కలిసి పాల్గొంటున్నారు. వార్ 2 చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆగస్టు లో మొదలు కాబోయే ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబో మూవీకోసం అలియా భట్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట.
అనుకోవడం కాదు.. ప్రశాంత్ నీల్ అలియా భట్ ని సంప్రదించబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. మరి అప్పుడు అలియా భట్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మిస్ అయినా.. ఈసారి NTR 31 కోసం ఆమెని తీసుకురావాల్సిందే.. ఈ పెయిర్ అయితే ఫ్రెష్ గా, కొత్తగా ఉంటుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.