Advertisement
Google Ads BL

వార్ 2 : ఇద్దరు ఉద్ధండులు ఢీ అంటే.!


ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి చూపు వార్ 2 పైనే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్-గ్లోబల్ స్టార్ మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 పై అంచనాలు మాములుగా లేవు. ఇద్దరు హీరోలు స్నేహితులుగా కనిపిస్తేనే.. అభిమానులు సంబరపడిపోతాడు. మరి ఇద్దరి హీరోల మద్యన వార్ అంటే ఇంకెంత ఎగ్జైట్ అవుతారు. 

Advertisement
CJ Advs

వార్ 2 షూటింగ్ కోసం యంగ్ టైగర్ తరచూ ముంబై వెళుతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మధ్య మధ్యలో దేవర షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా వార్ 2 కి పని చేస్తున్న యాక్షన్ కొరియాగ్రాఫర్ ఫ్రాన్జ్ స్పిల్హాస్ వార్ 2 యాక్షన్ ఎపిసోడ్ పై క్రేజీ కామెంట్స్ చేసారు. ఫ్రాన్జ్ స్పిల్హాస్ ఆధ్వర్యంలోనే ఆరు రోజుల పాటు స్పీడ్ బోట్ ఛేజ్ తెరకెక్కింది. 

సముద్రంలో ఉవ్వెత్తున ఎగసే అలల మధ్య జరిగే పడవల పందెంని డిజైన్ చేయడానికే మూడు నెలలు పట్టిందట. మరా ఎపిసోడ్ చిత్రీకరణకు ఏకంగా ఆరు రోజులు పట్టిందట. ఆరు రోజుల పాటు ఏకధాటిగా ఈ పడవల ఎపిసోడ్ ని షూట్ చేశారట. అదే కాదు హృతిక్, ఎన్టీఆర్ ల మధ్య ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టిన యాక్షన్ ఫైట్ కూడా మరో అద్భుతమని అంటున్నారు. 

మరి ఇద్దరు అగ్ర హీరోలు సింగిల్ స్క్రీన్ పై వార్ కి సిద్ధపడితే ఎలా ఉంటుందో అంచనా వెయ్యడం కూడా కష్టమే. అదే ఇప్పుడు వార్ 2 లో జరగబోతుంది అని హృతిక్-ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 

Action choreographer on War 2 Climax:

War 2: Stunt Choreographer About NTR And Hrithik Roshan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs