Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ బి క్షమాపణలు


స్టార్ హీరోల అభిమానులు తమ హీరోని ఎవరైనా కించపరుస్తున్నా, లేదంటే విమర్శించినా అస్సలు ఊరుకోరు. వాళ్ళని ట్రోల్ చేస్తూ తెగ ఏడిపించేస్తారు. అంతేకాదు ఏదైనా సినిమాలో తమ హీరోపై మరో యాక్టర్ డామినేషన్ చూపించినా ఊరుకోరు. వాళ్ళని తిట్టి పోస్తారు. ఇలాంటి సంఘటన జరక్కుండా బాలీవుడ్ స్టార్ అమితాబ్ ముందుగానే ప్రభాస్ ఫ్యాన్స్ కే క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్, కమల్, దీపికా పదుకొనె, దిశా పఠానీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 27 న విడుదల కాబోతున్న కల్కి ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్ కి అమితాబచ్చన్ కి మధ్యన అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంది. అందులో అమితాబ్ ప్రభాస్ ని ఎత్తెత్తి పడేస్తారు. 

అది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫీలయ్యే ఉంటారు. అందుకే ముందుగా అమితాబ్ వారికి సారి చెప్పేసారు. తాజాగా కల్కి టీమ్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ.. ప్రభాస్ అభిమానులు తనను మనస్ఫూర్తిగా క్షమించాలని, ఎందుకంటే వాళ్ళ హీరోని ఎత్తి పడేసి కొట్టే సన్నివేశాలు కల్కి 2898 AD లో ఉన్నాయని ఆయన చెప్పడం చాలా సరదాగా అనిపించింది. 

అంతకుముందు ముంబై ఈవెంట్ లోను అమితాబ్ ప్రభాస్ ని ఆటపట్టించిన తీరు ప్రభాస్ అభిమానులకి ఎంతగానో నచ్చింది. ఇప్పుడు కూడా అమితాబ్ చమత్కారంగా అభిమానుకి సారి చెప్పడం మాత్రం భలే అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Big B apologises to Prabhas fans:

Why Did Amitabh Bachchan Apologise To Prabhas Fans?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs