2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో సినిమా ఇండస్ట్రీ పీపుల్ చాలామంది సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలకి శుభాకాంక్షలు తెలియజేసారు. అది ఓకె. కానీ కొంతమంది కూటమి విన్ అయినందుకు పార్టీలు వగైరా చేసుకుంటున్నారు. బహిరంగంగానే పార్టీలు చేసుకుంటున్నారు. అది కొంతమందికి నచ్చినా మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు.
చంద్రబాబు అధికారంలో లేనపుడు నేనున్నాను అంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ కొద్దిమంది మాత్రమో బాబు ని సపోర్ట్ చేసారు. కష్ట కాలంలో పక్కన ఉన్నవారే స్నేహితులు, జగన్ ప్రభుత్వాన్ని కాదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే తమ మీద జగన్ ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందేమో అనే భయంతో చాలామంది కామ్ గా ఉన్నవారు ఉన్నారు.
ఇప్పుడు చంద్రబాబు గెలిచాక అంతే సైలెంట్ గా పార్టీలు చేసుకున్నవారు లేకపోలేదు. ఇలా ఓపెన్ గా సక్సెస్ పార్టీ నిర్వహిస్తే మాత్రం ఉపయోగం ఉంటుందా, అప్పుడేమయ్యారు వీళ్లంతా, ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ టీడీపీ నేతలు కూడా సినిమా ఇండస్ట్రీపై కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ ప్రభుత్వంలో లాభపడి.. జగన్ ప్రభుత్వం రాగానే తాము చంద్రబాబు వల్లే నష్టపోయామంటూ కామెంట్స్ చేసారు. ఈరోజు వాళ్ళే చంద్రబాబు ని పొగుడుతున్నారు.. ఇలాంటి వాళ్ళు ఏం చేసినా ఉపయోగం లేదు.
ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళని అస్సలు నమ్మకూడదు అంటూ కూటమి నేతలు ఓపెన్ గానే సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం గమనార్హం.