ఒకప్పుడు బుల్లితెర పై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన అనసూయ భరద్వాజ్.. యాంకరింగ్ కి గ్లామర్ ని పరిచయం చేసింది. అందానికి అందం, అనర్గళంగా మాట్లాడుతూ.. అద్భుతమైన ఫిగర్ ని మైంటైన్ చేసే అనసూయ అటు యాంకరింగ్ ఇటు ఫోటో షూట్స్ తో రచ్చ చేసేది. గత రెండేళ్లుగా బుల్లితెరకి బ్రేకిచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టింది.
వెండితెర మీద సక్సెస్ రేట్ తో అదరగొట్టేస్తున్న అనసూయ మళ్ళీ బుల్లితెర మీదకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ అంటూ అనసూయ స్టార్ మా కి రాబోతుంది. శేఖర్ మాస్టర్ తో కలిసి ఆ షో కి జెడ్జ్ అవతారమెత్తింది. మరి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా వదిలిన పిక్స్ మాత్రం సో బ్యూటిఫుల్ అనేలా ఉన్నాయి.
భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసే వెకేషన్ పిక్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ తన సోలో పిక్స్ ని కూడా అలాగే షేర్ చేస్తుంది. తాజాగా బ్లూ శారీ లో అనసూయ అద్భుతమైన భంగిమలతో ఫోజులివ్వగా.. ఆ ఫొటోస్ ఇప్పడు నెట్టింట సంచలనంగా మారాయి.