Advertisement

జగన్ కి షో చూపించనున్న TFI


151 సీట్ల తో ముఖ్యమంత్రి అయినా తనని సరైన రీతిలో చిత్ర పరిశ్రమ సత్కరించలేదనే అక్కసు, ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ ని దెబ్బ తియ్యాలనే ధోరణి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేత పలు వికృత చర్యలు చేపించింది. టికెట్ రేట్ల విషయంలో సినిమా పరిశ్రమని జగన్ ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరూ చూసారు. అభ్యర్దించడానికి వెళ్లిన అగ్ర హీరోలను ఎలా అవమానించారో అంతా గుర్తుంచుకున్నారు. అందుకు తగ్గ ఫలితమే వచ్చింది, కాలమే కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చింది. 

Advertisement

కట్ చేస్తే 2024 లో ప్లేట్ తిరిగింది, ఫేట్ మారింది. పవన్ కళ్యాణ్ జెండా ఎగిరింది. జగన్ కి పులివెందుల మాత్రమే మిగిలింది. ఇక అసలు విషయానికొస్తే తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతలైన అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి  నవీన్ - రవిశంకర్, నాగవంశీ, PMF విశ్వప్రసాద్- వివేక్, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, దానయ్య తదితర ప్రముఖులు రేపు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు. గత ప్రభుత్వ వైఖరితో వారు ఎదుర్కున్న ఇబ్బందులను వివరించడంతో పాటు పరిశ్రమకు కావాల్సిన సహాయ సహకారాలు, భారీ సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్ల వెసులుబాటు, అదనపు ప్రదర్శనలు అనుమతులు వంటి పలు ముఖ్యాంశాలపై చర్చించబోతున్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన మరో ముఖ్య విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణే కాదు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ జనసేనే కావడం.!

గత ఎన్నికల సమయంలో కొంతమంది బహిర్గతంగా, ఎంతోమంది అంతర్గతంగా జనసేనకు మద్దతు పలికారు. చంద్రబాబు - పవన్ ల కూటమిని కోరుకున్నారు. మొత్తానికి అదే జరిగింది. అందరికి ఆనందం కలిగింది. అన్నింటికీ మించిన విశేషం ఏమిటంటే తెలుగు సినిమా టికెట్ రేట్ల విషయంలో అందరి కన్నా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్న వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల హీరో పవర్ స్టార్ నేడు శాసించే పవర్ లో ఉండడం. గతంలో రావాలి జగన్-కావాలి జగన్ అని వైసీపీ వాదులు పాడుకున్నట్టే.. చూడాలి జగన్-ఏడాలి జగన్ అంటున్నారు ప్రస్తుతం జనసైనికులు. 

TFI will show the show to Jagan:

Famous Tollywood producers to meet Dy CM Pawan Kalyan at camp office in Vijayawada..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement