Advertisement
Google Ads BL

లేట్ అయినా అదిరిపోయిన పవన్ ఫ్యామిలీ పిక్


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలిచింది మొదలు ఆయన ఫ్యామిలీ ఆయన వెన్నంటే ఉంటుంది. భార్య అనా లెజెనోవా అయితే పవన్ ని వదలడం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అకీరా ని తన పక్కనే ఉంచుకున్నాడు. జూన్ 4 ఎన్నికల రిజల్ట్ రోజు నుంచి పవన్ డిప్యూటీ సీఎం గా కేసరపల్లిలో ప్రమాణస్వీకారం చేసేవరకు భార్య అనా, పిల్లలు అకీరా, ఆద్యలు ప్రతిసారి హైలెట్ అవుతూనే ఉన్నారు. 

Advertisement
CJ Advs

అయితే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజున మెగా ఫ్యామిలీతో పాటుగా, పవన్ పిల్లలు కూడా ట్రాఫిక్ సమస్యలతో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు అనుకున్న సమయానికి చేరుకోలేకపోయారు. తాజాగా జనసేన పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పవన్ కళ్యాణ్ తో ఆయన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరా లతో పాటుగా అనా లెజెనోవా తో కలిసి దిగిన పిక్స్ ని షేర్ చేసారు. 

ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది అంటూ షేర్ చెయ్యడంతో లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి అదరగొట్టేసారు పవన్ అంటూ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. 

Pawan family pic which came late but latest:

Pawan Kalyan Viral Photo with Family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs