Advertisement
Google Ads BL

పవన్ అక్కడ కూడా హీరోనే!


పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా హీరో అయ్యారు. తాను సినిమా హీరోగా ప్లాప్ సినిమాలతోనే ఎదిగాను, రాజకీయాల్లో కూడా గత పదేళ్లుగా ఓడిపోతూనే ఇప్పుడు నిలదొక్కుకున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు ఇదే నిజం. జూన్ 4 న పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచింది మొదలు అసంబ్లీ లో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేవరకు ఆయన ఏది చేసినా ముచ్చటగానే కనిపించింది. 

Advertisement
CJ Advs

అసంబ్లీ గేటు దాటనివ్వను అన్నోళ్ల కి షాకిస్తూ అసంబ్లీ లో కూర్చున్నారు. సినిమా ఇండస్ట్రీ లో పవన్ ఏది చేసినా పవన్ ఫ్యాన్స్ ఆయన్ని ఆకాశానికెత్తేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అందులోను పవన్ డిప్యూటీ సీఎం గా చాలా బాధ్యతగా కనిపిస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ జరిగేలా అడుగులు వేస్తున్నారు. 

కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత పవన్ స్థానమే కనిపించడం పవన్ ఫ్యాన్స్ కి, జన సైనికులకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అసంబ్లీలోనే కాదు.. బయట కూడా ప్రజల్లో తన మార్క్ చూపిస్తున్నారు. శ‌నివారం అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాక ప‌వ‌న్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యుండి.. ఎలాంటి హడావిడి లేకుండా సామాన్య ప్ర‌జ‌ల కోసం అమ‌రావ‌తిలో రోడ్డు మీద గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హించ‌డం అందరిని ఆశ్చర్య అపరిచింది. 

అధికారం ఉంది కదా అని అది స్పాయిల్ చెయ్యకుండా పవన్ ప్రవర్తించడం ఆయన్ని ప్రజల్లో కూడా హీరోని చేసేసింది అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అదే కాదు విజవాడలో తన కుమార్తె కనిపించడం లేదు అంటూ ఓ తల్లి మొరపెట్టుకోగా.. ఆ సమస్య పరిష్కరించే దిశగా పవన్ ప్రయత్నాలు కూడా అందరూ మెచ్చుకునేలా చేసింది. ఇలా రాజకీయాల్లో కూడా పవన్ తన స్పెషాలిటీని చూపిస్తూ ప్రజల్లో కూడా హీరోగా మారిపోతున్నారు. 

Pawan is a hero there too!:

Pawan Kalyan has become a hero in politics as well
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs