దర్శకుడు శంకర్ ఇండియన్ 2-గేమ్ చేంజర్ షూటింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ డే అండ్ నైట్ వర్క్ అయితే చేస్తున్నారు కానీ.. మెగా అభిమానులని మాత్రం ప్రతిసారి డిజ్ పాయింట్ చేస్తూ వస్తున్నారు. జులై లో ఎట్టకేలకి ఇండియన్ 2 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న శంకర్ గేమ్ చేంజర్ విషయం తేల్చకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.
అక్టోబర్ లో ఎలాగైనా గేమ్ చేంజర్ విడుదల ఉటుంది అనుకుంటే.. ఇప్పుడది డిసెంబర్ లాస్ట్ వీక్ కి వెళ్లబోతుంది అంటున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం రామ్ చరణ్ దసరా ని వదిలేసి గేమ్స్ చేంజర్ తో దీపావళికి రావాలని.. దివాళీ కి వస్తే ఆ సెలవలు ప్లస్ అవుతాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు కూడా ఎట్టి పరిస్థితుల్లో గేమ్ ఛేంజర్ ని ఈ ఏడాదే తేవాలనే కసితో ఉన్నారు.
మరి చరణ్ దివాళీ ని టార్గేట్ చెయ్యడం మెగా అభిమానులకి కిక్ ఇచ్చే విషయమే. రామ్ చరణ్-కియారా అద్వానీ జంటగా వస్తున్న ఈ చిత్రంలో SJ సూర్య విలన్ గా కనిపిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.