జగన్ పై సొంత కార్యకర్తల్లో ఎంత ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయో అనేది ఈరోజు శనివారం పులివెందులలో జగన్ ఇంటి దగ్గర జరిగిన ఘటన చూస్తే తెలుస్తోంది. నిన్న అసంబ్లీ లో ఏదో నామ మాత్రంగా ప్రమాణ స్వీకారానికి హాజరైన జగన్ కి అసంబ్లీ గేటు బయటే జగన్ మావయ్య అంటూ అక్కడి ప్రజలు మాస్ ర్యాగింగ్ చేసారు. ఇక ఈరోజు అసంబ్లీ కి వెళ్లకుండా జగన్ పులివెందుల పయనమయ్యాడు.
పులివెందులలో జగన్‌కు ఊహించని పరిణామం ఎదురయ్యింది. సొంత పార్టీ కార్యకర్తలే జగన్‌పై తిరుగుబాటు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ పులివెందుల ఇంటికి రాగానే.. జగన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు చేయడం కలకలం సృష్టించింది. అధికారంలో ఉండగా తాడేపల్లికే పరిమితమైన ఇప్పుడు ఓడిపోయాక పనిగట్టుకుని పులివెందులకు రావడంపై కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేసారు.
అదే కోపంతో జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేయడమే కాకున్నా మూకుమ్మడిగా జగన్ ఇంట్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు.. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానా రచ్చ చేసారు. ఈ హఠాత్పరిణామానికి జగన్ ఎలా ఉన్నాడో కానీ.. ఆయన ప్రవేట్ సెక్యూరిటీ మాత్రం కార్యకర్తలను నిలువరించడంలో నానా ఇబ్బందులు పడ్డారు.
జగన్ ఓడిపోయినప్పటి నుంచి జగన్ పై కేడర్ చాలా ఆగ్రహంతో కనిపిస్తుంది. వాలంటీర్లని నమ్మి తమని పక్కనపెట్టడంపై వారు నిరాశలో ఉన్నారు. అదే నిరాశలో నుంచి జగన్ పై ఆగ్రహం తన్నుకొచ్చింది. అక్కడ పులివెందులలో జగన్ పై సొంత కార్యకర్తలే ఎదురుతిరగడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు.