Advertisement

పవన్ మాటలకు అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!


అసెంబ్లీలో నవ్వులు పూయించిన పవన్!

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవికి సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు మాత్రమే నామినేషన్ వేయగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం సీఎం చంద్రబాబు, 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్.. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అయ్యన్నను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా అయ్యన్న గురుంచి ఒక్కొక్కరుగా మాట్లాడుతూ.. విశిష్ట సేవలను కొనియాడారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ మాట్లాడారు.

నవ్వులే నవ్వులు!

ఎన్నో ఏళ్లుగా పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని.. అధ్యక్షా అని మాట్లాడితే చూడాలని అభిమానులు, జనసైనికులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఇవాళ్టితో ఫలించాయి. పవన్ మాట్లాడారు.. నవ్వులు పూయించారు కూడా..! అయ్యన్న గురించి మాట్లాడుతూ.. సభాద్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకెళ్ళాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు మీ వాడి వేడి తో కూడిన మాటలు విన్నామని.. ఇక మీ నుంచి అలాంటి మాటలు లేకపోయినా బాధ్యతతో మార్గం చూపించే మాటలు వింటామన్నారు. రుషికొండను కొట్టినట్టు అయ్యన్న పదునైన మాటలు, ఉత్తరాంధ్ర యాసతో ప్రత్యర్థులకు గుండు కొట్టారన్నారు. ఐతే ఒక్కటే బాధేస్తోంది సార్.. ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు కానీ సభలో ఎవరు తిట్టుకున్నా ఆఫ్ చేసే బాధ్యత మీపై ఉందని పవన్ చెప్పుకొచ్చారు. సేనాని మాట్లాడుతున్నంత సేపూ సభలో ఒక్కటే నవ్వులే నవ్వులు. ఇంకొందరు సభ్యులు బల్లలు చరిచారు. ఇలా పవన్ ప్రసంగం ముగిసే వరకు నవ్వులు పూయించారు. 

మూల సిద్ధాంతాలు! 

2047 నాటికి ఏపీ ఉన్నతంగా ఉండాలంటే ఇప్పుడే దానికి పునాది వెయ్యాలన్నారు.. విభేదించడం, వాదించడం చర్చకు మూల సిద్ధాంతాలని అంతేగాని, దూషణలు, కొట్లాట కాదన్నారు. పొట్టి శ్రీరాములు చావుకు దగ్గర అవుతూ చేసిన ఒక్కో రోజు దీక్ష  ఒకటిన్నర ఏళ్లుకు సమానమని.. మహానుభావుడు, బ్రతికినప్పుడే కాదు చనిపోయినప్పుడు అయన గుర్తుండాలన్నారు. ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసేలా ఉండాలని స్పీకర్ అయ్యన్నను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. అంతే కాకుండా.. పశువు, పక్షి, చెట్టుకు కూడా బావుండాలని కోరుకుంటున్నట్లు సభలో పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగంలో మాట్లాడారు.

వైసీపీ పారిపోయింది!

ఓటమిని తీసుకోలేని స్థితిలో వైసీపీ ఉందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. 11 సీట్లకు పరిమితమై సభలో కూర్చునే ధైర్యం లేక పారిపోయిందన్నారు. గత ఐదేళ్లు సభలో వ్యక్తిగత దూషణలకే వైసీపీ ప్రాధాన్యమిచ్చి.. రాష్ట్ర అభివృద్ధిని మరిచిపోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ సమస్యకు పరిష్కారం దొరికేలా ఉన్నత స్థాయి చర్చలకు అసెంబ్లీ వేదిక కావాలని లేకుంటే అమరజీవి పొట్టిశ్రీరాములు బలిదానాన్ని అవమానించట్లేనని పవన్ చెప్పుకొచ్చారు. కాగా.. నిన్న ప్రమాణ స్వీకారానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ ఎన్నికకు రాకుండా డుమ్మా కొట్టారు. దీంతో వైసీపీపై అధికారపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

Laughter in the assembly for Pawan words!:

Pawan Kalyan Mass ragging YS Jagan In Assembly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement