మెగా ఫ్యామిలిలోకి చిన్న కోడలి స్థానంలోకి వెళ్లిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి అటు అత్త మామలతో ఇటు ఆడపడుచుతో అనుబంధాన్ని చూపిస్తూనే మెగా ఫ్యామిలీ కోడలిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. మరోపక్క వీలున్నప్పుడల్లా భర్త వరుణ్ తేజ్ తో కలిసి సరదాగా వెకేషన్ ప్లాన్ చేసుకుంటుంది. ఈ జంట రీసెంట్ గానే లండన్ ట్రిప్ వెళ్ళొచ్చింది.
ఇక వరుణ్ తేజ్ మట్కా షూటింగ్ సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. ఇటు లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేదే లేదు.. అవకాశం వస్తే నటనని కంటిన్యూ చేస్తాను అంటూ చెప్పకనే చెప్పేసింది. ఆ విషయంలో తనకి భర్త వరుణ్ తేజ్ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పే లావణ్య త్రిపాఠి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
ఒకప్పుడు గ్లామర్ షోకి కాస్త డిస్టెన్స్ ని మైంటైన్ చేసిన లావణ్య త్రిపాఠి.. కొన్నాళ్లుగా గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మరీ టూ మచ్ కాకపోయినా.. కావాల్సినంత అందాల ప్రదర్శనకు దిగుతుంది. తాజాగా బ్లాక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో లావణ్య త్రిపాఠి బ్యూటిఫుల్ గా మెస్మరైజ్ చేసింది. మీరు ఓసారి మెగా కోడలు గ్లామర్ లుక్ ని వీక్షించండి.