కొద్దిరోజులుగా స్తబ్దుగా కనిపించిన బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇప్పుడు సూర్య 41 చిత్రంలో హీరోయిన్ గా ఎంపికై మరోసారి తన హవా చూపించేందుకు రెడీ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో జోడి కట్టిన ఈ భామ వరసగా ఐదారు సినిమాలు నిరాశ పరచడంతో.. సైలెంట్ అయ్యింది. ఒక ఏడాది పాటు ఆమెకి అవకాశాలు కూడా రాలేదు.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టీవ్ గా కనిపించే పూజ హెగ్డే సూర్య ప్రాజెక్ట్ తగలడంతో మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అప్పుడప్పుడు స్పెషల్ ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ అభిమానులని మెస్మరైజ్ చేసే పూజ హెగ్డే తాజాగా పింక్ కాస్ట్యూమ్స్ తో ఓ ఫోటో వదిలింది.
పింక్ డ్రెస్ లో పింక్ బేబీ లా స్మైల్ ఇవ్వడంతో పూజ హెగ్డే ని పింక్ బేబీ ఎంత ముద్దొస్తున్నావో తెలుసా, బ్యూటిఫుల్, అద్భుతం అంటూ ఫ్యాన్స్ మాత్రమే కాదు నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.