గత ఐదేళ్ళలో అధికారం నెత్తికెక్కి ప్రతిపక్షాన్ని పురుగులకన్నా హీనంగా చూసి అనరాని మాటలతో రెచ్చిపోయిన రోజా కి 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పలేదు. ఓటమి తర్వాత కామ్ గా ఉంటుంది అని అనుకుంటే రోజా మాత్రం మెల్లగా యాక్టీవ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. మంచి చేసి ఓడిపోయాము, చేడు చేస్తే సిగ్గు పడాలా అని, ప్రతిరోజు చిరునవ్వుతో మొదలు పెట్టి, చిరునవ్వుతో ముగించాలంటూ చెబుతున్న రోజా తాజాగా ఎన్నికల ఓటమిపై పెదవి విప్పింది.
తాజాగా జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన రోజా ఎన్నికల ఓటమిపై స్పందించింది. నరేంద్ర మోదీకి నలభై శాతం ఓట్లొచ్చాయి.. ఆయన కూటమి సహాయంతో ప్రధాని అయ్యారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డికి కూడా నలభై శాతం ఓట్లొచ్చాయి.. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అదే 40 శాతం ఓట్లొచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు 11 సీట్ల కే పరిమితమయ్యారు.
అసలు మేము ఎలా ఓడిపోయామో అనేది అర్ధం కావడం లేదు. ఇలాంటి ఓటమి రోజు ఒకటి ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని రోజా వాపోయింది. ఇక రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడిన రోజా చంద్రబాబు హయాంలో ఇలాంటి ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు, అదే జగన్ కడితే టీడీపీ ప్రభుత్వం ఓర్వలేకపోతుంది అంటూ రోజా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేసింది.