Advertisement
Google Ads BL

ఈ వారం కూడా చిన్న సినిమాలదే హావా


గత కొన్ని వారాలుగా బాక్సాఫీసు దగ్గర చిన్న సినిమాలు హావా చూపిస్తున్నాయి. ఎన్నికల హడావిడి కావడంతో పెద్ద సినిమాలేవీ విడుదలయ్యేందుకు మొగ్గు చూపకపోవడంతో చిన్న సినిమాలు పండగ చేసుకున్నాయి. ప్రతి వారం నాలుగైదు సినిమాలు విడుదలయ్యేవి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులని నిరాశపరిచినా.. మరికొన్ని సినిమాలు మాత్రం ఆకట్టుకునేవి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలు హావా చూపించడానికి రెడీ అవుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ వారం విడుదలయ్యే సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా లేదు. చిన్న సినిమాలు ప్రమోషన్స్ తో ఊదరగొడుతున్నా.. అవి ఎంతవరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయో అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ వారం విడుదలయ్యే సినిమాల్లో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చిత్రాల ఫేమ్ వరుణ్ సందేశ్ నిందా మాత్రమే కాస్త క్రేజ్ ఉన్న మూవీలా  కనిపిస్తుంది. వరుణ్ సందేశ్ అండ్ టీం నింద ని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తూ కష్టపడుతున్నారు. 

అలాగే వెన్నెల కిషోర్, నందిత శ్వేతా ల OMG(ఓఎంజి ఓ మంచి ఘోస్ట్) హర్రర్ ఫిలిం కూడా జూన్ 21 నే రాబోతుంది. చైతన్య రావు, హెబ్బా పటేల్ ల హానీ మూన్ ఎక్స్ ప్రెస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల లు ఈ వారం బాక్సాఫీసు బరిలో పోటీ పడుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అయ్యాయి. అందులో సీతా కల్యాణ వైభోగమే, అంతిమతీర్పు, సందేశం, మరణం, పద్మవ్యూహంలో చక్రధారి లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. 

This week is also about small movies:

Movies in Theatres this Week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs