Advertisement
Google Ads BL

క్లీంకార బర్త్ డే : ఉపాసన ఎమోషనల్ పోస్ట్


జూన్ 20 న మెగా ఫ్యామిలీకి పండగ రోజు.. గత ఏడాది ఇదే జూన్ 20 న మెగా వారసురాలి జననం ఆ ఫ్యామిలీని ఆనందంలో ముంచెత్తింది. రామ్ చరణ్ - ఉపాసన లు 11 ఏళ్ళ వివాహబంధములో ఇదే రోజు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. ఉపాసన ప్రెగ్నెంట్ అన్నపటినుంచి రామ్ చరణ్ ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. ఉపాసన డెలివరీ రోజున చరణ్ ఎంత టెన్షన్ పడ్డాడో.. అంత ఎగ్జైట్ అయ్యాడు. పదకొండేళ్ళుగా మెగా వారసుల కోసం రకరకాల ప్రశ్నలను ఎదుర్కున్న చరణ్ దంపతులు.. అంతటి ఒత్తిడిని దాటుకుంటూ పాపకి జన్మనిచ్చారు. 

Advertisement
CJ Advs

క్లీంకార పుట్టుక మెగా ఫ్యామిలీలోకి సంతోషాన్ని తీసుకొచ్చింది. ఏడాది కాలంగా మెగాస్టార్ చిరు మానవరాలితో ఆడుకుంటూ మురిసిపోతున్న క్షణాలను, క్లీంకార తో చరణ్ ఆడుకుంటున్న సందర్భాలను, క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలిలో జరిగిన అద్భుతాలను ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వస్తుంది. 

క్లీంకార పుట్టి ఏడాది గడుస్తున్నా ఇంకా పాప ఫేస్ ని రివీల్ చెయ్యని ఉపాసన..  క్లీంకార పుట్టిన జూన్ 20 కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. Happiest first birthday, my darling Klin Kaara Konidela. You complete us. Thank you for bringing so much joy and happiness into our lives. I’ve watched this video a million times. 🥹@alwaysramcharan Thank u @josephradhik & team for capturing these memories అంటూ ఉపాసన ఆ వీడియో తో పాటుగా ఎమోషనల్ గా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

Klinkara first B-Day: Upasana turns emotional:

Upasana turns emotional on Klinkara first birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs