Advertisement

2029కి ముందే ఏపీలో ఎన్నికలు!?


ఇదేంటి.. నిన్నగాక మొన్నే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. అప్పుడే ఇలా అంటుంటే కాస్త విచిత్రంగా, అంతకు మించి నమ్మశక్యంగా లేదు కదా..? అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే. ఇంతకీ ఎందుకు.. ఎప్పుడు ఎన్నికలు..? అసలెందుకు ఈ టైంలో ఇంత రచ్చ, చర్చ జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!

Advertisement

ఇదీ అసలు సంగతి!

వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ అదేనబ్బా.. ఒకే దేశం- ఒకే ఎన్నికలు నిర్వహణపై ఎన్నో రోజులుగా చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. నాడు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో 2023 సెప్టెంబర్ లో 8 మందితో కూడిన నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఈ కమిటీ ఒక నివేదికను రూపొందించగా త్వరలోనే ఇది కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై నిశితంగా చర్చించి త్వరలోనే జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టడానికి మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. మోదీ మూడోసారి ప్రధాని అయిన కొన్ని గంటల్లోనే 100 రోజుల అజెండా సిద్ధం చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రణాళికను న్యాయశాఖ శాసన విభాగం సిద్ధం చేస్తోంది. వీలైనంత త్వరగా కేబినెట్ ముందు ఉంచాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని ఢిల్లీ, బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

జమిలి ఎన్నికలు అంటే..? 

ఇండియాలో మామూలుగా సాధారణ ఎన్నికలు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరుతున్నాయ్. మరోవైపు దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయ్. దీనికి తోడు ప్రభుత్వాలను రద్దు చేసి కొత్తగా ఎన్నుకోవడం ఇవన్నీ షరా మామూలే అవుతున్నాయ్. అందుకే ఇలా కాదని దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు ఉండేలా మోదీ సర్కార్ గతంలోనే ప్లాన్ చేసింది. అదే జమిలీ ఎన్నిక. అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఒకే దేశం - ఒకే ఎన్నిక అని దీనికి పేరు పెట్టారు కూడా. ఇలా చేయడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘంపై ఎన్నికల ఒత్తిడి, ఎన్నికల నిర్వహణ, వ్యయం తగ్గుతుందని అన్నది కేంద్రం ఆలోచన.

ఏపీలో అప్పుడే హడావుడి..?

ఇండియాలో ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయన్నది దేశంలోని అన్ని పార్టీలకు తెలుసు. అందుకే ఇది వరకే ఏర్పడిన.. కొత్తగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అన్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాయి. అదేలాగంటే.. సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఏమున్నా సరే ముందస్తుగా జరపాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. ఏపీలో ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులకు హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇదంతా మూడో కంటికి తెలియకుండా లోలోపల జరుగుతోందని లీకులు వస్తున్నాయ్. జమిలి ఎన్నికలు జరిగితే మాత్రం ఏపీలో రెండు నుంచి మూడేళ్ల లోపే ఎలక్షన్ జరుగుతోంది అన్న మాట.

అయ్యే పనేనా..? 

కేంద్రంలో అలా.. రాష్ట్రాల్లో హడావుడి జరుగుతూనే ఉన్నప్పటికీ ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే.. మోదీ జుట్టు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ చేతుల్లో ఉంది. అందుకే ఈ జమిలి ఎన్నికలకు మోదీ ఓకే అనుకున్నప్పటికీ.. బాబు, నితీష్ ఒప్పుకుంటే తప్ప ముందుకు వెళ్లదు. దీనికి తోడు లోక్ సభలో బిల్ పాస్ కావాలి.. ఆ తరవాత రాజ్యసభలో కూడా కావాల్సి ఉంది. ఇల్లు అలకగానే పెళ్లి ఐపోదు కదా.. అలాగే మోదీ 3.0 అనుకుంటే సరిపోదు అందరి ఆమోదయోగ్యం కావాల్సి ఉంది.. ఐనా పెద్దనోట్ల రద్దు లాంటిదే చేసిన ఉన్న పళంగా చేసిన మోదీకి వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ పెద్ద విషయం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Elections in AP before 2029!?:

Jamili elections mean..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement