తాను ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి, పెంచి పోషించి.. అదే వాలంటీర్ వ్యవస్థ పై విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకుని.. కార్యకర్తలతో, ఎమ్యెల్యేలతో, మంత్రులతో తనకేమి పని లేదు, వాలంటీర్ వ్యవస్త సక్సెస్ అయ్యింది.. అవే మనకు ఓట్లు రాలుస్తాయని నమ్మిన జగన్ ని అదే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు నిట్ట నిలువునా ముంచేసింది అని ఎవరో కాదు.. స్వయానా వైసీపీ నేతలే జగన్ ని ఆ వాలంటీర్ వ్యవస్థని విమర్శిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి వాలంటీరు వ్యవస్థని మొదలు పెట్టి నిజంగా పెన్షన్ దారులకి మంచే చేసాడు. అందుకే వాలంటీర్లు కూడా వైసీపీ పార్టీని మొయ్యడానికి రెడీ అయ్యారు.. ఈసీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఇంటింటికి వాలంటీర్లని వెళ్లి పెన్షన్ దారులకి డబ్బులు ఇవ్వొద్దని చెప్పడంతో.. అదేదో టీడీపీ నే చేయించింది అని వాళ్ళు కూడా జగన్ న నమ్ముకుని రాజీనామాలు చేసేసారు.
వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ కి దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. జగన్ పై ఈ వాలంటీర్ వ్యవస్థ పై విపరీతమైన విమర్శలు చేసారు వైసీపీ నేతలు. ఇప్పుడు అదే వాలంటీర్లు జగన్ పై ఫైర్ అవ్వడం కాదు.. జగన్ కి చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు. తమని కొంతమంది వైసీపీ నేతలు బెదిరించి రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు రోడ్డెక్కారు.
మమ్మల్ని ఆదుకోమంటూ టీడీపీ ఎమ్యెలు, మంత్రుల వెంట పడుతుంటే.. వారేమో ముందు మిమ్మల్ని బెదిరించి రాజీనామాలు చేయించిన వాళ్లపై కేసు పెట్టి అప్పుడు రండి.. మీకు న్యాయం చేస్తామంటూ లెక్కలు వేస్తున్నారు. పాపం జగన్ తాను పెంచి పోషించిన వ్యవస్థే తనపై తిరగబడింది అని లోలోపల ఏడుస్తూ ఉన్నాడేమో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.