కల్కి 2898 AD చిత్రం పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో కొలమానంలో కొలవడం కష్టం. విపరీతమైన హైప్ తో జూన్ 27 న విడుదల కాబోతున్న కల్కి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నేడు బుధవారం ముంబైలో ఓ ఈవెంట్ ని ప్లాన్ చేసారు మేకర్స్. రానా హోస్ట్ గా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో స్టార్ట్ అయ్యింది. ఈ ఈవెంట్ కి ప్రెగ్నెంట్ తో ఉన్న దీపికా పదుకొనె వస్తుందా, రాదా అని చాలామంది వెయిట్ చేసారు.
కానీ దీపికా పదుకొనె కల్కి 2898 AD ఈవెంట్ లో ప్రత్యేకంగా బేబీ బంప్ తో కనిపించింది. రానా వ్యాఖ్యాతగా మొదలైన ఈ ఈవెంట్ లో ప్రభాస్, అమితాబ్, దీపికా, కమల్ హాసన్ పాల్గొన్నారు. రానా, ప్రభాస్ లు కాసేపు సరదాగా మాట్లాడి కల్కి గురించి చెబుతూ ప్రభాస్ స్టేజ్ దిగెయ్యగా.. దీపికా పదుకొనె కల్కి గురించి మాట్లాడానికి స్టేజ్ ఎక్కి తన స్పీచ్ ముగించి దిగబోతుండగా.. ఆమెకి ప్రభాస్ హెల్ప్ చేస్తూ చెయ్యందించిన వీడియో వైరల్ గా మారింది.
దీపికాని జాగ్రత్తగా స్టెప్స్ దించడానికి ప్రభాస్ చెయ్యందించగా.. ప్రభాస్ ని జాగ్రత్తగా అమితాబచ్చన్ పట్టుకుంటూ టీజ్ చెయ్యడంతో ప్రభాస్ చాలా సిగ్గు పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన అందరూ ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించగా దీపికా బేబీ బంప్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి.