Advertisement
Google Ads BL

హీరో దర్శన్ కేసులో మరో ట్విస్ట్


కన్నడ హీరో దర్శన్-పవిత్ర గౌడ్ ఇంకా కొంతమంది రేణుక చౌదరి హత్యకేసులో ప్రస్తుతం పోలీస్ రిమాండ్ లో ఉన్నారు. అభిమానిని చంపించిన కేసులో హీరో దర్శన్ కటకటాల పాలయ్యారు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడ్ కోసం దర్శన్ కొంతమంది కిరాయి వ్యక్తులతో రేణుక చౌదరిని అతి కిరాతకంగా హత్య చేయించిన విషయం సంచలనంగా మారింది. 

Advertisement
CJ Advs

పవిత్ర గౌడ్ కి నీచమైన మెసేజ్ పంపించినందుకు తాను రేణుక చౌదరిపై కోపంగా రెండు దెబ్బలు మాత్రమే వేసాను అని.. కానీ నేను అతన్ని చంపమనలేదు అంటూ దర్శన్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. మరోపక్క దర్శన్ కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ బలవన్మరణానికి పాల్పడటం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది. 

దర్శన్‌ మేనేజర్ శ్రీధర్ దర్శన్ కి చెందిన బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లోనే మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం, తన చావుకి ఎవ్వరు బాద్యులు కాదు అంటూ శ్రీధర్ చనిపోయిన చోట సూసైడ్ లెటర్ దొరకడం, తాను ఒంటరిగా ఉన్నానని.. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు మరణ వాంగ్మూలంలో శ్రీధర్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. శ్రీధర్ ఆత్మహత్య దర్శన్ కేసులో కీలకంగా మారింది అంటున్నారు. ఇక రేణుక స్వామి మర్డర్ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా మొత్తం 15 మందిని ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

Darshan Thoogudeepas manager commits suicide :

 Darshan Thoogudeepas manager commits suicide at the actors farmhouse in Bengaluru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs