Advertisement
Google Ads BL

ప్రభాస్ క్రేజ్ సరిపోతుందా నాగి..


బాహుబలితో ప్రభాస్ కి వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని ఏ దర్శకులు పర్ఫెక్ట్ గా వాడుకోవడం లేదు. అంటే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలిని ఎంత ప్రాణం పెట్టి తీశారో.. ఆ చిత్రాన్ని అంతే ప్రాణం పెట్టి ప్రమోట్ చేసారు. ఊరు వాడా తిరిగారు, ప్రతి లాంగ్వేజ్ ఆడియన్స్ కి ప్రభాస్ ని దగ్గర చేసారు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన దర్శకులెవరూ అలా చెయ్యలేకపోయారు.

Advertisement
CJ Advs

ప్రభాస్ సపోర్ట్ చెయ్యడం లేదో.. లేదంటే దర్శకులే ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ సరిపోతుంది అనుకుంటున్నారో కానీ.. సాహో దగ్గర నుంచి స్టిల్ కల్కి వరకు అదే జరిగింది, జరుగుతుంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఈ చిత్రాలన్నిటికి ప్రమోషనల్ ఈవెంట్స్ విషయంలో అభిమానులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే.. మేకర్స్ మాత్రం కేవలం ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సరిపెట్టేసారు.

ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ చాలు.. కల్కి కి పెద్దగా ప్రమోషన్స్ చెయ్యక్కర్లేదు అనుకుంటున్నాడో ఏమో కానీ.. ప్రభాస్ అభిమానులు మాత్రం కల్కి 2898 AD  ప్రమోషన్స్ విషయంలో చాలా అసంతృప్తి గా ఉన్నారు. కల్కి ని వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి బుజ్జి ని రోడ్డు మీదకి వదిలి చేతులు దులుపుకున్నారు. ప్రమోషన్స్ విషయంలో ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా.. కల్కి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని అందరూ కీర్తిస్తుంటే.. హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిన కల్కి 2898 AD ప్రమోషన్స్ కనీసం చిన్న సినిమావాళ్లు చేసినట్టుగా కూడా చెయ్యట్లేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా గింజుకుంటున్నారు. 

Is Prabhas craze enough Nagi..:

Prabhas fans are clamoring for Kalki promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs