ప్రస్తుతం రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న జంట చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలయిక. అది అందరికి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచే పని మొదలు పెట్టారు. రేపటి నుంచి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. బాధ్యతలు తీసుకునేముందు అక్కడికి వెళ్లి ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుని తన కర్తవ్య నిర్వహణలో ఉంటానని చెప్పడం అందరిని అలరించింది.
చంద్రబాబు ఆహ్వానం, కళ్యాణ్ ని స్వాగతించిన తీరు ఫ్యాన్స్ అందరూ ముచ్చటపడిపోయి మురిసిపోయే స్థాయిలో ఉంది. 19 వ తారీఖు ఆయన డిప్యూటీ సీఎం గా ఆయనకి కేటాయించిన శాఖా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓ వైపు ఆయన కంప్లీట్ చెయ్యాల్సిన సినిమాలున్నాయి, చెయ్యాల్సిన పనులున్నాయి.
ఇప్పుడు ఇటు వైపు పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తారా, అటువైపు ఏమైనా కాస్త కన్నేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.. చూద్దాం జనసేనాని అడుగులు ఎటు వైపో అనేది..!