ఫహద్ ఫాసిల్ పుష్ప చిత్ర కేరెక్టర్ ని ఇష్టపడి చెయ్యట్లేదు.. సుకుమార్ మీదున్న గౌరవంతోనే పుష్ప లో భన్వర్ సింగ్ షెకావత్ కింద చేశాను, పుష్ప చిత్రం వలన నాకేమి ప్లస్ అవ్వలేదు అంటూ మొన్నామధ్యన ఆయన నటించిన ఓ సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే పుష్ప చిత్ర షూటింగ్ కి ఫహద్ ఫాసిల్ సరిగ్గా డేట్స్ ఇవ్వని కారణముగా షూటింగ్ లేట్ అవుతుంది అన్నారు.
ఇపుడు ఆయన డేట్స్ ఇవ్వడంతో ఆగమేఘాల మీద పుష్ప 2 ని పూర్తి చేస్తున్నారు. అయితే ఫాహద్ ఫాసిల్ పుష్ప ద రూల్ చిత్రానికి ఇంతని రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఆయన రోజుకి ఇంత అని ఫీజు వసూలు చేస్తున్నాడట. ఫాహద్ ఫాసిల్ కాల్ షీట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ఆయన రోజుకి 12 లక్షల చొప్పున ఎన్ని రోజులైతే అన్ని 12 లక్షలు పుష్ప మేకర్స్ నుంచి పారితోషికంగా తీనుకుంటున్నాడట.
అంతేకాదు.. తాను పుష్ప షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాక ఏదైనా ఇబ్బంది వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయినప్పటికి.. ఆయనకిచ్చే 12 లక్షలు ప్లస్ మరో రెండు లక్షలు అదనంగా నిర్మాతల నుంచి ఛార్జ్ చేస్తున్నాడట. కారణం తన డేట్స్ ఎంత విలువైనవో అనేది ఈ పారితోషికం రూపేణా చెబుతున్నాడట ఆయన.
మరి పుష్ప లో ఫహద్ ఫాసిల్ రోల్ చాలా కీలకం. ఆయన తోనే సినిమా నడవాల్సి ఉంది. మెయిన్ విలన్ ఫహద్ కావడం, ఆయన ఇచ్చిన డేట్స్ ని సుకుమార్ గతంలో సరిగ్గా వాడుకోకపోవడం, ఇప్పుడు ఆయన్ని అడిగితే కుదిరినప్పుడు డేట్స్ ఇవ్వడం ఇవన్నీ పుష్ప 2 పోస్ట్ పోన్ కి కారణమయ్యాయి అంటున్నారు.