పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గానే కాదు మరికొన్ని మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. సోమవారం బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇకపై తాను నటిస్తున్న సినిమా షూటింగ్స్ ని పూర్తి చెయ్యాలనుకుంటున్నారట. గత ఆరు నెలలుగా పవన్ కళ్యాణ్ సెట్స్ లో కనిపించలేదు. రాజకీయాల్లో బాగా బిజీ అయ్యారు.
ప్రస్తుతం గెలుపుని ఆస్వాదిస్తున్న పవన్ ఇకపై మిగతా షూటింగ్స్ కంప్లీట్ చేసేసి మళ్ళి రాజకీయాలవైపు మళ్ళాలని అనుకుంటున్నారట. అందుకే హరి హర వీరమల్లు మేకర్స్ కి పవన్ డేట్స్ ఇవ్వబోతున్నారని సమాచారం. ముందుగా హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చెయ్యాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట.
ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలని పూర్తి చెయ్యాలనుకుంటున్నాని తెలుస్తోంది. వీరమల్లు మేకర్స్ కి హరిహర వీరమల్లు షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోండి అంటూ పవన్ నుంచి కబురు కూడా వచ్చిందట. హరి హర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మిగతా షూటింగ్ పూర్తి చెయ్యబోతున్నారు.
వీరమల్లు షూటింగ్ జూలై మొదటి వారంలో స్టార్ట్ కానుంది అని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పార్ట్-1 ను రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.