నార్త్ లో సక్సెస్ అయినట్టుగా సౌత్ లో బిగ్ బాస్ అంతగా సక్సెస్ అవ్వకపోయినా.. ప్రతి సీజన్ ని ఎంతో కొత్తగా ప్లాన్ చేస్తూ యాజమాన్యం బుల్లితెర మీద హడావిడి చేస్తూనే ఉంది. మొదట్లో యంగ్ టైగర్ హోస్ట్ గా చెయ్యగా తర్వాత నాని వచ్చాడు. ఆ తర్వాత వరసగా నాగార్జునే హోస్ట్ గా వస్తున్నారు.
అయితే బిగ్ బాస్ లో గెలిచి విర్రవీగుతూ బయటికొచ్చిన వినర్స్ కెరీర్ లో ఏదో సాధించేద్దామని అనుకుని హౌస్ నుంచి కాలు బయటపెడుతున్నారు. కానీ బిగ్ బాస్ లో విన్నర్ అయ్యి ట్రోఫీ తో బయటికొచ్చిన ఒక్కరు కూడా కేరీర్లో మెరుపులు మెరిపించలేదు. శివ బాలాజీ దగ్గర నుంచి, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, సన్నీ, అభిజిత్, రేవంత్, గత ఏడాది పల్లవి ప్రశాంత్ వీళ్ళెవ్వరూ కెరీర్ లో అద్భుతాలు సృష్టించలేదు.
అసలు వీళ్ళేమైపోయారో కూడా తెలియదు. శివ బాలాజీ కి మా ఎలక్షన్ లో హడావిడి చేసాడు. కౌశల్ మండా హీరో అంటూ హడావిడి చేసాడు. రాహుల్ ఆస్కార్ వేదికపై పాట పాడాడు. ఇక అభిజిత్ అడ్వాంచర్స్ అంటూ బయలుదేరాడు. సన్నీ మాత్రం ఒకటి రెండు ప్రాజెక్ట్స్ తో హంగామా చేసినా ఏం చెయ్యలేకపోయాడు.
సింగర్ రేవంత్ విన్నరయ్యాక రేర్ గా దర్శనమిచ్చాడు. గత ఏడాది పల్లవి ప్రశాంత్ చేసిన హడావిడి అంతా అంతా కాదు.. సినిమాల్లో బిజీ అవుదామని కలలు కన్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు ఏ సినిమా ఒప్పుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ మారో సీజన్ మొదలయ్యేందుకు సమయం దగ్గరపడిపోతుంది.