యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత బుధవారమే గోవా నుంచి హైదరాబాద్ వచ్చారు. అక్కడ దేవర కి సంబందించిన ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ హైదరాబాద్ కి వచ్చారు. మళ్లీ ఈరోజు ఎన్టీఆర్ ఫ్యామిలీ తో థాయిలాండ్ వెళుతూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ థాయిలాండ్ బయలుదేరి వెళ్లారు.
అయితే ఎన్టీఆర్ అక్కడకి ఫ్యామిలీ తో టైం స్పెండ్ చెయ్యడానికే కాదు.. థాయిలాండ్ లొ దేవర కి సంబందించిన రొమాంటిక్ సాంగ్ షూట్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ అక్కడికి వెళ్లారు. కొరటాల శివ జాన్వీ కపూర్ - ఎన్టీఆర్ పై ఓ రొమాంటింగ్ ని తెరకెక్కిస్తున్నారు. ఆ పాట కోసం ఎన్టీఆర్ థాయిలాండ్ వెళ్లారు. పని లో పనిగా ఫ్యామిలీని కూడా తీసుకెళ్లారు.
అక్టోబర్ 10 నుంచి దేవర ప్రీ పోన్ అయ్యి సెప్టెంబర్ 27 కే రాబోతుంది. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు. దేవర ఆగమనం కోసం రెండేళ్ళగా వాళ్ళు ఎదురు చూడని రోజు లేదు.