Advertisement
Google Ads BL

సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్న మెగా ఫ్యామిలీ


నిన్నటివరకు మెగా ఫ్యామిలీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయంగా గెలిచి ఫ్యామిలీ మొత్తాన్ని ఆనందపరిచారు. పవన్ కళ్యాణ్ గెలుపుని తమ గెలుపులా భావించి మెగా ఫ్యామిలీ పొంగి పోయింది. ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ రిలాక్స్ అనుకోవడానికి లేదు.

Advertisement
CJ Advs

మెగా కుటుంబం మరో సెలబ్రేషన్ కి రెడీ అవుతుంది. అది మెగాస్టార్ చిరంజీవి వారసురాలు.. క్లింకార పుట్టిన రోజు రాబోతుంది. జూన్ 20 న మెగాస్టార్ మనవరాలు పుట్టింది. పాప పుట్టాక 11 రోజులకి బారసాల కార్యక్రమాన్ని చరణ్, ఉపాసన కుటుంబాల నడుమ ప్రవేట్ గా గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత క్లింకార మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టిన సందర్భం, అలాగే వినాయకచవితి, సంక్రాంతి ఫెస్టివల్స్ అన్ని పాపతో పాటుగా మెగా కుటుంబం ఆనందంగా జరుపుతుంది.

క్లింకార పుట్టి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పాప ఫేస్ ని రివీల్ చెయ్యలేదు. మరి జూన్ 20 న పాప పుట్టిన రోజు నాడు ఏమైనా రివీల్ చేస్తారేమో అని అభిమానులు ఆత్రంగా చూస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలిలో మెగా వారసురాలి బర్త్ డే వేడుకల కోసం ఇండస్ట్రీ ప్రముఖులకి ఆహ్వానాలు అందబోతున్నాయని, క్లింకార బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. 

Mega family getting ready for celebrations:

Klin Kaara birthday at June 20th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs