మహా శివరాత్రికి NBK109 గ్లిమ్ప్స్ తో నందమూరి, మాస్ అభిమానులకి పూనకాలు తెప్పించిన దర్శకుడు బాబీ ఉగాది ఫెస్టివల్ కి NBK 109 టైటిల్ రివీల్ చేస్తాడని అభిమానులు ఆశ పడ్డారు. కానీ జరగలేదు. ఆతర్వాత బాలయ్య రాజకీయాల్లో బిజీ అయ్యారు. రెండు నెలల పాటు ఎన్నికల బరిలో ప్రచారం అంటూ చమటలు చిందించారు. ఆ తర్వాత ఆయన ఇమ్మిడియట్ గా NBK 109 షూటింగ్ లో దిగిపోతారని అనుకున్నారు.
అటు బాలయ్య మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించినా ప్రస్తుతం బాలయ్య మాత్రం ఏ మంత్రి పదవిని ఆశించకుండా హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే జూన్ 10 న బాలయ్య బర్త్ డే కి అయినా NBK 109 టైటిల్ వదులుతారని అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినా బాబీ ఎందుకో టైటిల్ విషయం తెగ్గొట్టలేదు.
ఇక NBK 109 విడుదల దసరాకి అన్నా ఇప్పుడు ఎలక్షన్ హడావిడిలో అది కాస్తా డిసెంబర్ కి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. బాలయ్య అఖండ చిత్రం డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు NBK 109వ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అని తెలుస్తోంది. డిసెంబర్ లో సినిమా రిలీజ్ అంటే దాదాపు సూపర్ హిట్ అన్నట్టే లెక్క. మరి ఆ డేట్ ఎప్పుడో ఫైనల్ చేస్తే ఫ్యాన్స్ కూడా కూల్ అవుతారు.