సూపర్ స్టార్ మహేష్ కి సినిమాల్లో ఎంత క్రేజ్ ఉందో.. ఫ్యామిలీ మ్యాన్ గా అంతే పేరుంది. సినిమా షూటింగ్స్ లో పడి ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయకపోవడం, తన బిజీ వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉండడం చేసే మహేష్ ఎంత చిన్న ఖాళీ దొరికినా ఆ సమయాన్ని ఫ్రెండ్స్ కోసమో.. లేదంటే ఇతర విషయాల కోసమో ఖర్చు పెట్టరు. కేవలం ఫ్యామిలీ కోసమే టైమ్ స్పెండ్ చేస్తారు.
పిల్లలు సితార, గౌతమ్, నమృతలతో కలిసి విదేశాలకి వెళ్లి అక్కడ ఛిల్ అవుతారు. పిల్లలతో కావాల్సినంత టైమ్ స్పెండ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు కూడా ఫ్రెండ్స్, స్కూల్ అంటూ బిజీగా ఉంటారు. అలా ఓ ట్రిప్ వెళితే వాళ్ళకి నాతో సమయం గడిపేందుకు అవకాశం వాళ్ళకి దొరుకుతుంది, నాకు వాళ్లతో ఆడుకునేందుకు తీరిక దొరుకుతుంది అందుకే ట్రిప్స్ వేస్తా అంటూ మహేష్ చెబుతారు.
ఇక మహేష్ కి కూతురు సితార అంటే ప్రత్యేకమైన ఇష్టం. సితార పాప తో ఆడుకుంటున్న క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ని, వీడియోస్ ని ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఫాదర్స్ డే కావడంతో సితార తండ్రి మహేష్ దగ్గర పడుకుని ఆడుకుంటున్న పిక్ తో తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలిపింది సితార. ఆ పిక్ లో మహేష్-సితార ని చూడగానే ఫాదర్-డాటర్ బాండింగ్ అంటే ఇలా ఉండాలి అని కామెంట్ చేసేలా ఉంది.