నేడు ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ తన కుమర్తె క్లింకార తో కలిసి ఆడుకుంటున్న పిక్స్ ని షేర్ చేసారు. క్లింకార పుట్టి మరో నాలుగు రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలిలో క్లింకార తో కలిసి ఎన్ని సెలెబ్రేషన్స్ జరిగినా పాప ఫేస్ ని ఇప్పటివరకు చరణ్-ఉపాసనలు రివీల్ చెయ్యలేదు.
కానీ పాప తో ఆడుకుంటున్న పిక్స్ ని, వీడియోస్ ని ఉపాసన మాత్రం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. పాప ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఆ ఫొటోస్ ని మాత్రమే షేర్ చేసుకుంది. నిన్న శనివారం వెడ్డింగ్ యానివర్సరీ పిక్ అంటూ క్లింకార తో కలిసి చరణ్-ఉపాసన సరదాగా నడుస్తున్న పిక్ ని షేర్ చేసారు.
ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లింకార తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పిక్ ని షేర్ చెయ్యగా అది క్షణాల్లో వైరల్ గా మారింది.