జగన్ ని ఫాలో అవుతున్న సీఎం చంద్రబాబు అనగానే.. ఆయనేదో మంచి చేసారు.. ఈయనేదో ఆయన్ని అనుసరిస్తున్నారు అని కాదు. గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపట్టి.. పలు మాజీ మంత్రులని అనేక ఇబ్బందులు పెట్టి.. అవకాశం ఉన్నోళ్లని జైల్లో పెట్టి, లేని వాళ్ళని దారుణంగా హింసించారు.
అందులో ముందుగా టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన ప్రజావేదిక కూల్చివేత, అలాగే స్పీఎకర్ గా పని చేసిన కోడెల శివ ప్రసాద్ ప్రభుత్వ ఫర్నీచర్ ని వాడుకున్నారంటూ ఆయనని వేధించి సూసైడ్ చేసుకునేవరకు తీసుకెళ్లడం, ఆ తర్వాత అచ్చెన్నాయుడు, చంద్రబాబు లని కేసుల్లో ఇరికించి వాళ్ళని జైలు కి పంపించడం, అక్రమ కట్టడాలంటూ కూల్చివేతలు ఇలా జగన్ ప్రభుత్వంలో టీడీపీ వాళ్లని చాలా ఇబ్బందుల పాలు చేసారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా గతంలో జగన్ ప్రభుత్వం చేసినట్టుగానే కక్ష సాధింపు చర్యలు చేపడుతుందా అనేలా కొన్ని విషయాలు కనబడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ ని ఇంటికి తరలించి వాడుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో జగన్ ఫర్నిచర్ దొంగ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాదే అని విర్రవీగుతూ గతంలో వైసీపీ నేతలు ఆక్రమించిన ఆస్తులని స్వాధీనం చేసుకోవాలంటూ టీడీపీ నేతలు అప్పుడే హడావిడి స్టార్ట్ చేసేసారు.
మరి చంద్రబాబు నాయుడు అలోచించి అడుగులు వేసే వ్యక్తి. అలాంటిది జగన్ మాదిరిగా అడుగులు వెయ్యడం అనేది కొంతమందికి రుచించడం లేదు. ఇబ్బందిపెట్టిన వాళ్ళని వదలమని చెప్పడం లేదు కానీ.. దీనికి కొంత సమయముంది అంటూ కొంతమంది నెటిజెన్స్ సలహాలు పడేస్తున్నారు.