Advertisement
Google Ads BL

వారసుడి రాక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్


పవన్ కళ్యాణ్ వారసుడు జూన్ 4 నుంచి స్టిల్ ఇప్పటివరకు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతున్నాడు. సినిమా ఈవెంట్స్ లో పెద్దగా కనిపించని పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ తండ్రి రాజకీయ గెలుపుని ఆస్వాదిస్తున్నాడు. పవన్ పక్కనే కనిపిస్తూ అభిమానులని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా పంచె కట్టులో అకీరా చాలా అంటే చాలా స్పెషల్ గా మెరిసిపోయాడు. అకీరాని అలా చూసి పవన్ అభిమానులు ఆగడం లేదు. ఈ కటౌట్ సినిమాల్లోకి వస్తే అదిరిపోతోంది అంటూ మాట్లాడుకుంటున్నారు. నరెంద్ర మోడీకి అకీరాని పరిచయం చెయ్యడం అన్ని మీడియాలో తెగ హైలైటయ్యాయి. 

అందుకే పవన్ ఫ్యాన్స్ కూడా అకీరా ని సినిమాల్లోకి తీసుకురావాలని డిమాండ్ మొదలు పెట్టారు. నిన్నమొన్నటివరకు అకీరా కనిపిస్తే చాలనుకున్న అభిమానులు ఇప్పుడు వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చే క్షణం కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం అధికారంతో బాగా బిజీగా వున్నారు. కొడుకు ఫ్యూచర్ ని కూడా పవన్ ప్లాన్ చేస్తే బావుంటుంది అని అభిమనుల కోరిక. 

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా వుండి సినిమాలు ఎక్కడ వదిలేస్తారో ఇలాంటి సమయంలో వారసుడి ఎంట్రీ ఉంటే బావుంటుంది అని ఫ్యాన్స్ ఆలోచన. 

Fans are waiting for the arrival of the successor:

Fans are waiting for the arrival of Pawan Kalyan successor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs