Advertisement
Google Ads BL

పవన్ కి ప్రయారిటీ.. వాళ్ళ ఏడుపు స్టార్ట్


చంద్రబాబు పవన్ కళ్యణ్ ని కొడుకులా భావించడమే కాదు.. కూటమి గెలుపుకి పవన్ చేసిన కృషికి బాబు గారు పవన్ కి సముచిత స్థానమిస్తున్నారు. ఏపీ ప్రభుత్వలో చంద్రబాబు నెంబర్ 1 అయితే నెంబర్ 2 గా పవన్ కళ్యాణ్ ని నిలబెట్టారు. కొడుకు కదా అని లోకేష్ ని ఎక్కడా హైలెట్ చెయ్యలేదు. ముందు పవన్ తర్వాత లోకేష్ అన్నట్టుగా చంద్రబాబు పవన్ పై వాత్సాల్యం చూపిస్తున్నారు. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా, సపోర్ట్ అన్ని చంద్రబాబు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటా అని పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే కాకుండా పలు శాఖల బాధ్యతలు కట్టబెట్టారు. ఇక ఈరోజు చంద్రబాబు ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేలా చూస్తున్నారు. 

అది చూసిన బ్లూ మీడియా ఏడుపు స్టార్ట్ చేసేసింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఇస్తున్న ప్రయారిటీ చూసి పవన్ ని నెత్తిక్కించుకుంటున్న బాబు అంటూ ఏడుపు స్టార్ట్ చేసింది. చంద్రబాబు పవన్ కి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడం లేదు అనే జనసేన నేతల ఆరోపణలను చంద్రబాబు ఇలా తిప్పికొడితే.. ఇప్పడు చంద్రబాబు పవన్ కి ఇస్తున్న ప్రయారిటీ చేసి టీడీపీ వాళ్లే గోల చేస్తున్నారంటూ వారిలో వారికి మనస్పర్థలు వచ్చేలా రాతలు కోతలు మొదలుపెట్టింది. 

ఏదైనా పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ఇస్తున్న గౌవరానికి టీడీపీ, జనసేన ఎవరూ మాట్లాడకపోయినా అది మాత్రం బ్లూ మీడియా, వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది వాస్తవం. 

Priority to Pawan.. Their crying started:

Chandrababu and Pawan photos in Govt offices
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs