Advertisement
Google Ads BL

మామ గెలుపు అల్లుడు మొక్కులు


పదేళ్లుగా రాజకీయాల్లో పోరాడి ఫైనల్ గా 2024 ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో గెలవడమే కాదు.. తన జనసేన పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ ని చూసి మెగా స్టార్ చిరంజీవి పొంగిపోగా.. ఆయన కొడుకు అకీరా ఆనందపడ్డాడు. ఇక మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మామ కోసం పిఠాపురం వెళ్లి ప్రచారంచేశాడు. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవడంతో అకీరా తో వెళ్లి మరీ మామ పవన్ కళ్యాణ్ ని ఎత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. అంతేకాదు పవన్ డిప్యూటీ సీఎం పదవి పొందిన క్షణం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్ళాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్యెల్యేగా గెలిచి అన్న మెగాస్టార్ ఆశీస్సులు తీసుకున్న సందర్భంలోను సాయి ధరమ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. 

ఇక అల్లు అర్జున్ మావయ్య పవన్ కళ్యాణ్ ని అవాయిడ్ చేసిన కారణంగా అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టిన సాయి ధామ్ తేజ్.. ఈరోజు కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. 

Pawan Kalyan Gelupu son-in-law Mokku:

Sai Dharam Tej Visits Tirumala by Walk From Alipiri
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs